ఉద్యోగులకు కోత‌.. రిటైరైన వారికి మోత‌.. జ‌గ‌నన్న అంతేనా?

Update: 2022-11-30 08:30 GMT
ఏపీలో జ‌గ‌న్ పాల‌నపై ఎవ‌రు ఏమ‌నుకున్నా నెటిజ‌న్లు మాత్రం ఆస‌క్తిగా స్పందిస్తున్నారు. రాష్ట్రంలో నిధుల కొర‌తో.. జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితో తెలియ‌దు కానీ.. ఉన్న ఉద్యోగుల‌ను ప‌క్కన పెడుతున్నారు. కొత్త‌గా ఏమైనా నిరుద్యోగుల‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్నారా? అంది కూడా లేదు. పైగా వేత‌నాలు ఇవ్వ‌డానికికూడా నెల‌ల త‌ర‌బ‌డి ప‌డుతున్న స‌మ‌యం క‌నిపిస్తోంది. అప్పుటు చేస్తే త‌ప్ప‌.. ముద్ద‌దిగ‌ని ప‌రిస్థితి అంటారు కదా.. అదే ఉంది.

అయితే, మ‌రోవైపు.. సుదీర్ఘ కాలంగా అంటే.. దాదాపు 30-35 ఏళ్ల‌పాటు ఉన్న‌త‌స్థాయిలో ప్ర‌జ‌ల‌కు సేవ చేసి.. వ‌య‌సు రీత్యా రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తున్న‌వారికి మాత్రం జ‌గ‌న్ కొత్త ఉద్యోగాలు ఇస్తున్నారు. పోనీ.. వారికేమ న్నా.. త‌ప్ప‌దు.. ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. ప్ర‌జ‌ల‌కు పాల‌న చేర‌డం లేదు. అందుకే ఇస్తున్నామ‌ని అనుకోవ‌చ్చా?  అంటే.. అది కాదు.. వారికోసం.. ఇప్ప‌టి వ‌ర‌కు లేని పోస్టుల‌ను సృష్టిస్తున్నారు. దీనివ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ల‌బ్ధి చేకూర‌క‌పోగా.. ఖ‌జానాకు మాత్రం బొక్క‌ప‌డుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. అది కూడా ల‌క్ష‌ల్లోనే!

తాజాగా ఏం జ‌రిగిందంటే.. బుధ‌వారం(నేడు) పదవీ విరమణ చేయనున్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మతో పాటుగా మరో ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ లకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంపర్ ఇచ్చారు. సీఎస్ గా పదవీ విరమణ చేసిన మరుక్షణమే సమీర్ శర్మ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)లో శ‌ర్మ కీలక బాధ్యతలను చేపట్టనున్నారు.

ఐఏఎస్ అధికారిగా పదవీ విరమణ చేసిన తర్వాత సమీర్ శర్మను ఎక్స్ అఫీసియో చీఫ్ సెక్రటరీగా నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ అఫీసియో చీఫ్ సెక్రటరీ హోదాలో సమీర్ శర్మ... సీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా నియమితులు కానున్నారు. ఈ మేరకు సీఎంఓలో సమీర్ శర్మ కోసం ఓ ప్రత్యేక పోస్టును రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది. మ‌రి దీనివ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఆయ‌న చేసే సేవ ఏంటో స‌ర్కారు వారికే తెలియాలి.

ఇదిలా ఉంటే.. బుధ‌వార‌మే(నేడు) పదవీ విరమణ చేయనున్న మరో సీనియర్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ కు కూడా సీఎం జగన్ బంపర్ ఆపర్ ఇచ్చారు. విజయ్ కుమార్ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పోస్టును సృష్టించింది. స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈఓగా విజయ్ కుమార్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రణాళికా విభాగం ఎక్స్ అఫీషియో సెక్రటరీ హోదాలో విజయ్ కుమార్ ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వీరికి 1.5 ల‌క్ష‌ల జీతం, కారు, బంగ్లా య‌థాత‌థం.. అందుకే.. నెటిజ‌న్లు ఏమంటున్నారంటే.. ఉద్యోగులకు ఆకుల్లో.. రిటైరైన వారికి కంచాల్లో.. ఏందిది జ‌గ‌నన్నా! అని.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News