టికెట్ల కు ముహూర్తం పెట్టిన జగన్...?

Update: 2022-12-17 06:30 GMT
వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 అంటూ దూకుడు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2024 ఎన్నికలకు సంబంధించి టికెట్లను  ఏడాది ముందుగానే ప్రకటిస్తారా అన్న చర్చ సాగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి తాజాగా  ప్రకటించిన నేపధ్యంలో జగన్ రూట్ మ్యాప్ ని ఆ దిశగానే సిద్ధం చేశారని అంటున్నారు.

తాజాగా జరిగిన వైసీపీ ఎమ్మెల్యేల వర్క్ షాప్ లో పనితీరు బాగులేని ఎమ్మెల్యేలకు వంద రోజుల టైం ఇస్తున్నట్లుగా జగన్ స్పష్టంగా చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఎట్టి పరిస్థితులలో మార్చి నెలాఖరు లోగా తమ గ్రాఫ్ ని పెంచుకోవాలని జగన్ సీరియస్ గానే చెప్పేశారు అని అంటున్నారు. అపుడు సర్వేల నివేదికను బట్టి వరి పనితీరుని మరో మారు బేరీజు వేస్తామని ఆయన పేర్కొన్నారని అంటున్నారు.

దీనిని బట్టి చూస్తే పనిచేసే వారికి టికెట్లు అన్న సూత్రం ఆధారంగా వచ్చే ఏడాది ఏప్రిల్ లో నిర్వహించే మీటింగులో ఎవరికి టికెట్లు రావో అన్నది జగన్ క్లారిటీగా చెప్పేస్తారు అని అంటున్నారు. అదే టైం లో టికెట్లు లభించని వారి ప్లేస్ లో కొత్త వారు వస్తారు అని అంటున్నారు. అంటే వారికి టికెట్లు ప్రకటించి ఏడాది ముందు నుంచే పనిచేసుకోమని చెబుతారు అని అంటునారు.

వారే కాకుండా పనితీరు బాగున్న వారందరికీ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వచ్చే ఎన్నికల్లో మీరే అభ్యర్ధులు అంటూ వారిని జనంలోకి పంపిస్తారు అని అంటున్నారు. నిజానికి అధికారంలో ఉన్న పార్టీ చాలా ముందుగా అభ్యర్ధులను ప్రకటించడం అన్నది కుదిరే వ్యవహారం కాదు. ఎందుకంటే ముందు ప్రసుత ప్రభుత్వం పాలన సవ్యంగా సాగాలి. పైగా ఎన్నో వత్తిళ్ళు ఉంటాయి.

కానీ జగన్ సక్సెస్ ఫార్ములా ఏంటి అంటే ముందుగా అభ్యర్ధులను ఖరారు చేయడం అని అంటున్నారు. అలా ఖరారు చేసి జనంలోకి పంపిస్తే వారికి వీలైనంత ఎక్కువ సమయం జనంలో ఉండేందుకు దొరుకుతుంది అని అది ఎన్నికల వేళ పూర్తిగా అనుకూలంగా మారి భారీ అడ్వాంటేజ్ ని ఇస్తుందని ఆయన నమ్ముతున్నారు. అందుకే జగన్ వచ్చే ఏడాది మార్చితో డెడ్ లైన్ పెట్టేశారు అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే అందరి కంటే ముందే వైసీపీ అభ్యర్ధుల ప్రకటన అయితే ఉంటుంది అని అంటున్నారు. వైసీపీలో పనిచేయని వారికి టికెట్లు దక్కవన్న దాన్ని బట్టి చూస్తే ముప్పయి నుంచి నలభై మంది దాకా పాతవారికి మళ్లీ పోటీ చేసే అవకాశం రాకపోవచ్చు అనే అంటున్నారు. ఏది ఎలాగున్నా ఏడాది ముందే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం ఎమ్మెల్యేలను ఖరారు చేయడం అంటే అది కత్తి మీద సామే.

కానీ వైసీపీకి సర్వం సహా తానే అయిన జగన్ ఇలాంటి విషయాల్లో కీలకమైన నిర్ణయాలను దూకుడుగానే తీసుకుంటారు అని అంటున్నారు. మొత్తానికి జ్గన్ ఆలోచనలు అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏప్రిల్ నెలలో టికెట్లు దక్కేదెవరికి ఏప్రిల్ ఫూల్స్ అయ్యేదెవరు అన్నది కచ్చితంగా తేలిపోతుంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News