ఇంటర్ విద్యార్థులకు జగన్ బెస్టాఫ్ లక్

Update: 2020-03-04 08:03 GMT
ఆంధ్రప్రదేశ్ లో పరీక్షల సీజన్ మొదలైంది. మార్చి నెలలలోనే ఇంటర్, డిగ్రీ, టెన్త్ పరీక్షలు జరగబోతున్నాయి. మరోవైపు, మార్చి 31లోపే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 14వ ఆర్థిక సంఘం నుంచి ఏపీకి రావాల్సిన 3200 వేల కోట్ల రూపాయలు వృథా కాకుండా ఉండాలంటే మార్చి 31లోపు సీఎం జగన్ ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి. ఓ రకంగా చెప్పాలంటే ఏపీలోని విద్యార్థులతోపాటు....సీఎం జగన్, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగానికీ ఎన్నికల నిర్వహణ పరీక్ష వంటిదే. ఈ క్రమంలోనే తన ఎన్నికల పరీక్ష ఒత్తిడిని పక్కనబెట్టిన సీఎం జగన్....తన యువ మిత్రులకు బెస్టాఫ్ లక్ చెప్పారు. నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యం లో విద్యార్థులకు జగన్ ట్వీట్ చేశారు.

ఏపీలో చాలామంది ప్రజలకు వైఎస్ జగన్ సీఎం అయితే....యువతీయువకులకు జగన్ ఓ అన్న....చిన్నారులకు ఓ మేనమామ...ఆడ పడుచులకు తోబుట్టువు...అవ్వా తాతలకు మనవడు....ప్రజలే తన కుటుంబం అని భావించిన జగన్....ఆయా సందర్భాల్లో వారి వెన్నంటి ఉన్నానని భరోసా కల్పిస్తుంటారు. సీఎం హోదాను పక్కకుపెట్టి మరీ....తన ప్రజా కుటుంబం తో మమేకమవుతుంటారు. ఈ క్రమంలోనే జగన్ ...ఇంటర్ పరీక్షలు రాస్తున్న తన యువ మిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘బెస్టాఫ్‌ లక్‌ మై యంగ్‌ ఫ్రెండ్స్‌...మనసులో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా...ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్ష రాయండి....ఇన్నాళ్లు మీరు పడిన కష్టం, సాధనకు తగిన ఫలితం దక్కే సమయం ఇదే.... మీ లక్ష్యం తప్పక చేరుకుంటారు` అని జగన్ విద్యార్థుల్లో భరోసా నింపేలా ట్వీట్ చేశారు.


సీఎం హోదాలో ఉండి కూడా జగన్ ...విద్యార్థులకు విషెస్ చెప్పడం తో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, ఏపీలో ఈరోజు నుంచి జరగనున్న ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలకు 5,46,368 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పరీక్షలకు అరగంట ముందే విద్యార్థులను నిర్వాహకులు పరీక్ష హాల్‌లోకి అనుమతించారు.
Tags:    

Similar News