ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రంజుగా ఉన్నాయి. మరో నాలుగు నెలలలో శాసన సభకు ఎన్నికలు జరుగుతుండడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. అధికార తెలుగుదేశం పార్టీ - ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలలో సందడి మొదలైంది. ఈ మధ్యనే పుట్టిన జనసేన కూడా ఈ హడావుడిలో తాను ఉన్నానంటూ ముందుకు వస్తోంది. ఇక జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ - కాంగ్రెస్ తామూ ఎవరితో కలవాలా - తమని ఎవరు ఆహ్వానిస్తారు అంటూ ఎదురు చూపులు చూస్తున్నాయి. శాసన సభ ఎన్నికలలో టిక్కెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఒక్కో నియోజక వర్గం నుంచి కనీసం ఐదు లేదా ఆరుగురు అభ్యర్దులు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రేసులో ఉన్నారు. గత ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందిన సిట్టింగ్ ఎమ్మెల్యేల స్దానంలో కూడా ఈ పోటీ తీవ్రంగా ఉందంటున్నారు. అలాగే గత ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైనవారు కూడా ఈ సారి టిక్కెట్లు ఆశిస్తున్నారు. దీంతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతోంది.
ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ ఇంత తీవ్రంగా ఉంటే అధికార తెలుగుదేశంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందంటున్నారు. శాసన సభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవుతుందన్న సర్వేలతో పార్టీ టిక్కెట్లు ఆశిస్తున్నవారి సంఖ్య నానాటికి తగ్గిపోతోందని అంటున్నారు. కొన్ని నియోజకవర్గాలలో అయితే ఖర్చులు భరిస్తామంటే ఓకే గానీ తమనే ఖర్చులు పెట్టుకోవాలంటే మాత్రం అభ్యర్దులు జంకుతున్నారట. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయమని, అందుకే అభ్యర్దులు ముందుకు రావటం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికలలో తెలుగుదేశం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన వారు ఈ సారి పోటీకి దూరంగా ఉందామని సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు సమాచారం. దీంతో అధకార పార్టీలో ఉత్తమ అభ్యర్దుల కోసం వెతుకులాట ప్రారంభమయ్యిందని అంటున్నారు. రానున్న శాసన సభ ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు దక్కించుకుంటే తమ గెలుపు నల్లేరు మీద నడకేనని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.