వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన అపరిపక్వతను మరోమారు చాటుకున్నారు. తెలంగాణలో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎత్తులు వేస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బరిలో దిగబోమంటూ జెండా పీకేశారు. ఈ మేరకు తన పార్టీ శ్రేణులకు చెప్పేశాడు!
గ్రేటర్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గ్రేటర్ కేడర్ కు తేల్చి చెప్పారు. అయితే ఎన్నికల బరినుంచి తప్పుకుంటున్నట్లుగా అధికారికంగా నేడో రేపో ప్రకటించే అవకాశం ఉంది. గ్రేటర్ ఎన్నికలలో వైకాపా పోటీ చేయదని తేలిపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ లో ఆ పార్టీ నేతలకు - కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోటీ చేయడం ద్వారా పార్టీ ఉనికిని నిలబెట్టుకోవడానికి అవకాశం దక్కేదంటే...ఆ మేరకు కూడా చాన్స్ ఇవ్వకుండా జగన్ తీసుకున్న నిర్ణయం సరికాదంటూ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. రెండు రాష్ర్టాల్లో ఉన్న పార్టీగా చెప్పుకునే పార్టీ కీలకమైన హైదరాబాద్ ఎన్నికల్లో పోటీకి దిగవద్దని నిర్ణయించుకోవడం సరికాదని మండిపడుతున్నారు.