త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పాలుపంచుకుంటామని, తెలంగాణలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తమకు ఇచ్చిన గిఫ్ట్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ప్రకటనలు చాలా ఆసక్తి గొలిపాయి. ఇప్పటికీ కేసీఆర్ ప్రకటనలపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో గడచిన ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టబోయినట్లుగా జనసేన అధినేత పవన్ సహకారంతోనే విజయం దక్కించుకున్న చంద్రబాబుకు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దానితో పాటుగా ఎక్కడ కేసీఆర్ ఎంటరై తమకు డ్యామేజీ చేస్తాడోనన్న భయం కూడా చంద్రబాబుకు బాగానే పట్టుకుంది. అయితే ఇవేవీ బయటపడకూడదన్న భావనతో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న చంద్రబాబు... ఏపీ పాలిటిక్స్ లోకి కేసీఆర్ వస్తే రానీ, తమకేమీ ఇబ్బంది లేదని చెబుతూ సాగుతున్నారు. అయినా చంద్రబాబు మాదిరిగా కేసీఆర్ అంత బెరుకు కలిగిన నేత కాదు కదా. ఈ విషయం కూడా తెలిసిన చంద్రబాబు... తనకు ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్‌ను కేసీఆర్ ఏ రీతిన అందిస్తారోనన్న భయంతో దాదాపుగా వణికిపోతున్నారని చెప్పక తప్పదు.
ఈ క్రమంలో వైసీపీ గెలుపు కోసం కేసీఆర్ ప్రచారం చేస్తారని, తెలుగు నేలను అన్యాయంగా విభజించడానికి కారణమైన కేసీఆర్‌తో జగన్ ఎలా సాయం తీసుకుంటారని కూడా ఇప్పుడు కొత్త ప్రశ్నలు సంధిస్తున్నారు. వాస్తవంగా టీడీపీ వ్యతిరేకంగా ఏపీలో ప్రచారం చేస్తామన్న వ్యాఖ్యలపై టీడీపీ వైరి వర్గాలు ముందుగా స్పందించాలి. అధికార పార్టీతో మైండ్ గేమ్ ఆడాలంటే నిజంగానే ఈ పని చేయాల్సిందే. అయితే ఏపీలో విపక్ష హోదాలో ఉన్న వైసీపీ ఈ పని చేయడం లేదు. కేసీఆర్ ప్రకటనపై వైసీపీ స్పందించకున్నా... క్షణక్షణానికి భయపడిపోతున్న టీడీపీ నిత్యం కేసీఆర్ ప్రకటనలనే ప్రస్తావిస్తూ... వైసీపీపై విమర్శలు సంధిస్తున్నారు. అయినా కూడా చంద్రబాబు జిత్తులమారి కుయుక్తులను ముందుగానే అంచనా వేసిన వైసీపీ... అసలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఏ ఒక్క పార్టీ మద్దతు అక్కర్లేదని తేల్చి పారేసింది. ఇటీవలే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టేశారు. అయినా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్పించి గెలవలేమన్న భావన తమలో లేదని, ప్రజా బలం లేని పార్టీలకే ఈ భావన ఉంటుందని, ప్రజల మద్దతుతో, ప్రజలను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్న తమలాంటి వారికి పొత్తులు అవసరమే లేదని తేల్చేశారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో గడచిన ఎన్నికల మాదిరిగానే సింగిల్ గానే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.
ఇక 2019 ఎన్నికల్లో ఏపీ వరకు వైసీపీకి మద్దతుగా టీఆర్ఎస్ ప్రచారం చేస్తుందని వినిపిస్తున్న వాదనపైనా వైసీపీ అధిష్ఠానం దృష్టి సారించడంతో పాటుగా ఆ తరహా స్నేహ హస్తం తమకు అవసరం లేదని కూడా టీఆర్ఎస్‌కు చేరవేసిందని సమాచారం. ఏపీలో టీఆర్ఎస్ ప్రచారంతో తమకు కలిగే లాభం కంటే కూడా నష్టమే ఎక్కువని కూడా వైసీపీ భావిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీపై కేసీఆర్ చేసిన ఆరోపణలు, సంచలన వ్యాఖ్యలను ఇప్పటికీ ఏపీ ప్రజలు మరిచిపోలేదని, ఈ సమయంలో కేసీఆర్ ఎంట్రీతో తమకు లాభం జరగదని కూడా వైసీపీ భావిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు అక్కడ చేసిన ప్రచారం కాంగ్రెస్ పార్టీకి ఎలాగైతే నష్టం చేకూర్చిందో... ఏపీలో కేసీఆర్ ప్రచారం కూడా తమకు అదే నష్టాన్ని మిగిలించనున్నదనే అంచనాతో ఉంది. ఈ కారణంగానే ఇప్పటికే సింగిల్‌గానే బరిలోకి దిగుతామని ప్రకటించిన వైసీపీ... తమకు టీఆర్ఎస్ ప్రచార సహకారం కూడా అవసరం లేదని తేల్చి చెప్పిందట. ఈ కారణంగానే ఏపీలో ప్రచారం చేసే విషయంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలి కన్‌క్లూజన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏపీ ఎన్నికల్లో వేలు పెట్టాల్సిన అవసరం తమకు అంతగా లేదని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్న విశ్లేషణలు సాగుతున్నాయి.