అమెరికాలో ఏపీ ప్రత్యేక హోదా ‘నిశ్శబ్ద’ సెగ

Update: 2015-10-12 05:14 GMT
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గత ఆరు రోజులుగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన సందర్భంగా నాటి కేంద్రసర్కారు పార్లమెంటులో ఇచ్చిన హామీని.. నేటి కేంద్ర సర్కారు ఇప్పటివరకూ పట్టించుకోకపోవటం.. అదేమంటే.. నీతి అయోగ్ నుంచి నివేదిక వచ్చే వరకూ ఆగమనటం తెలిసిందే.

ఏపీ ప్రజల ప్రయోజనాలు పరిరక్షించటంతో పాటు.. ఏపీ ముఖచిత్రాన్ని మార్చటంలో ప్రత్యేక హోదా ఎంతో కీలకం అవుతుందన్న వాదనను వినిపిస్తూ.. జగన్ దీక్ష చేపట్టారు. ఆయనకు సంఘీభావంగా అమెరికాలోని తెలుగు ప్రవాస భారతీయులు స్పందిస్తున్నారు. పార్టీలకు అతీతంగా వాషింగ్టన్ డీసీలోని లింకన్ మెమోరియల్ వద్ద ఆదివారం ఏపీ ప్రత్యేక హోదా కోసం ధర్నా నిర్వహించారు.

ఏపీలోని గుంటూరు నల్లపాడులో జగన్ నిర్వహిస్తున్న దీక్షకు తాము పూర్తి సంఘీభవం తెలుపుతున్టన్లు వారు వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ.. అమెరికాలోని తెలుగువారు నిశ్శబద్దంగా ధర్నా నిర్వహించటం గమనార్హం. అమెరికాలో నిర్వహించిన ధర్నాను సురేంద్ర రెడ్డి.. రమేష్ రెడ్డి వల్లూరు తదితరులు పర్యవేక్షించారు. ఏపీలో మొదలైన ప్రత్యేక హోదా దీక్ష సెగ.. అమెరికాలో కనిపించటం గమనార్హం.
Tags:    

Similar News