జీరో కొవిడ్ పాలసీ.. ఈ మాట వింటేనే చైనీయులు చిర్రెత్తిపోతున్నారు.. భయంతో పరుగులు పెడుతున్నారు. వారాలకు వారాలు ఎక్కడ లాక్ డౌన్ లో ఉండాల్సి వస్తుందోనని
హడలెత్తిపోతున్నారు. అతిపెద్ద ఐఫోన్ ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటైన ఫాక్స్ కాన్ నుంచి సోమవారం గోడలు దూకి మరీ కార్మికులు పరారైన సంఘటనలను చూశాం. ఫ్యాక్టరీలో 20 వేల మందికి
వైరస్ సోకిందన్న వార్తల నేపథ్యంలో.. తమనెక్కడ క్వారంటైన్ చేస్తారోనని కార్మికులు వందలాది కిలోమీటర్ల దూరంలోని ఇళ్లకు కాలినడకనే పయమవుతున్నారు.
ఒక్క కేసూ ఉండొద్దు.. అదే జీరో కొవిడ్ పాలసీ మిగతా దేశాలన్నీ కొవిడ్ తో సహజీవనం చేస్తూనే దాని వ్యాప్తి నిరోధానికి ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అంటే.. లాక్ డౌన్ కాకుండా కట్టడి చర్యలు, టీకా పంపిణీ తదితరాలపై ఆధార పడుతున్నాయి. ప్రత్యేక క్వారంటైన్ అంటూ లేకుండా విధానాలు అమలు చేస్తోంది. తద్వారా ప్రజా జీవనానికి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాయి.
కానీ, చైనా మాత్రం జీరో కొవిడ్ పాలసీ అంటూ కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. ఒక్క కేసు వచ్చినా.. అక్కడ లాక్ డౌన్ లు విధిస్తోంది. లక్షల మంది ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తోంది. షాంఘై లాంటి ప్రధాన నగరమే నెలలకొద్దీ లాక్ డౌన్ లో ఉందంటే చైనా లో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొవిడ్ లాక్ డౌన్ ల కారణంగా ఆర్థిక రాజధానిగా పేర్కొనే షాంఘైలోనే కాదు.. పదుల సంఖ్యలోని నగరాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
జనాలు ఉక్కిరిబిక్కిరి లాక్ డౌన్ ఒకసారి అంటే ఓకే.. మళ్లీ మళ్లీ ఎదుర్కొనాల్సి వస్తే ఆ కష్టం చెప్పనలవి కాదు. చైనాలో లాక్ డౌన్ అంటే మనలా ఉండదు. కఠినంగా అమలు చేస్తుంటారు. దీనిని తట్టుకోలేక ప్రజలు ఇటీవల హాహాకారాలు పెట్టిన కథనాలు వెలుగులోకి వచ్చాయి. మళ్లీ ఇప్పుడు అదే తరహా పరిస్థితులు వచ్చేలా ఉండడంతో వారి వెన్నులో వణుకు పుడుతోంది. దీంతో ఆంక్షలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్నారు. ఇందులో ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు.. బప్పిలహరి పాటలను ప్లే చేస్తుండడం విశేషం.
ఇందులో 1982 నాటి సూపర్ హిట్ సినిమా మిథున్ చక్రవర్తి 'డిస్కో డాన్సర్'లో సాంగ్ వారిని ఊపేస్తోంది. 'జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా' పాటను పాడుతూ చైనీయులు తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. 'జిమ్మీ, జిమ్మీ' పాటను చైనా సోషల్ మీడియా సైట్ 'డౌయిన్' (టిక్‌టాక్ చైనీస్ పేరు)లో మాండరిన్ భాషలో పాడుతున్నారు. 'జీ మీ, జీ మీ' అని చైనాలోకి అనువదిస్తే.. 'నాకు
అన్నం పెట్టండి, నాకు అన్నం పెట్టండి'అని అర్థం. లాక్ డౌన్ సమయంలో తాము ఆహార కొరతను ఎదుర్కొంటున్నామని.. పరిస్థితి దారుణంగా ఉందని తెలియజేసే విధంగా ప్రజలు ఖాళీ
పాత్రలను చూపిస్తున్నారు.
సరళీకరణకు ముందు భారతీయ చిత్రాల హవా ఇప్పుడంటే చైనా సరళీకరణ విధానాలతో దూసుకెళ్లింది కానీ.. 1990కి ముందు మనలాంటి దేశమే. కమ్యూనిస్టు సిద్ధాంతాలను పాటిస్తూనే సరళీకరణను చేపట్టిన చైనా ఎవరూ ఊహించనంతగా ఎదిగింది. అప్పట్లో భారతీయ సినిమాలను చైనీయులు బాగా ఆదరించేవారు. 1950-60 దశకాల్లో బాలీవుడ్ షోమ్యాన్ రాజ్ కపూర్ సినిమాలు చైనాలో అత్యంత ప్రజాదరణ పొందాయి. ఇటీవలి కాలంలో వచ్చిన '3 ఇడియట్స్', 'సీక్రెట్ సూపర్ స్టార్', 'దంగల్' , అంధాధున్' బాహుబలి వంటి అనేక చిత్రాల చైనా ప్రేక్షకులకు నచ్చాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.