కెప్టెన్‌గా ధోని ఖాతాలో ఎన్నో ఘనతలున్నాయి. వన్డేల వరకు భారత క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ కెప్టెన్ అతడే అనే విషయంలో ఎవరికీ సందేహాల్లేవు. బెస్ట్ కెప్టెన్ ఎవరన్నపుడు ధోనితో పోటీకి వచ్చే గంగూలీ సైతం వన్డేల్లో మహేంద్రుడే ఉత్తమ సారథి అని కితాబిచ్చాడు. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడంలో, మైదానంలో అద్భుతమైన వ్యూహాలు పన్నడంలో ధోనీకి ధోనీనే సాటి. ప్రస్తుతం భారత జట్టులో నిలదొక్కుక్కున్న చాలామంది.. తామీ స్థాయికి చేరుకోవడంలో ధోనీదే కీలక పాత్ర అని ఒప్పుకుంటారు. కెప్టెన్‌గా ధోని వారసత్వాన్ని అందుకుంటున్న కోహ్లి కూడా ఇదే మాట అన్నాడు.
ఐతే ప్రతిభావంతులకు మళ్లీ మళ్లీ అవకాశాలివ్వడంలో.. వాళ్లు కుదురుకునేలా చేయడంలో తప్పులేదు. కానీ ఒక ఆటగాడి ప్రతిభపై చాలా సందేహాలున్నా.. అతను వరుసగా విఫలమవుతున్నా.. మళ్లీ మళ్లీ అవకాశాలివ్వడం, వేరే ప్రతిభావంతులకు అన్యాయం చేయడం ఏమాత్రం సమంజసం కాదు. ధోని తీసుకున్న మిగతా నిర్ణయాలన్నీ ఓకే కానీ.. రవీంద్ర జడేజా విషయంలో అతడు చూపించే పక్షపాతం మాత్రం చాలామందికి నచ్చదు. ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన జడేజా.. ఎన్నడూ తన పాత్రకు న్యాయం చేసింది. లోయరార్డర్లో అతను చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడి ఎంత కాలమైందో. ఏదో స్పిన్‌తో అలా నెట్టుకొచ్చేస్తున్నాడు తప్ప.. ఎప్పుడూ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది లేదు. జట్టు తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న చాలా సందర్భాల్లో అతను చేతులెత్తేశాడు. బౌలర్ అయిన అశ్విన్‌పైన అయినా అంతో ఇంతో ఆశలు పెట్టుకోవచ్చు కానీ.. జడేజాను మాత్రం నమ్మలేం.
ఐతే భారత క్రికెట్లో ధోని హవా సాగినంత కాలం జడేజాకు ఏ ఇబ్బందీ లేకపోయింది. అతను మళ్లీ మళ్లీ అవకాశాలు దక్కించుకున్నాడు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ చేతిలో సిరీస్ ఓటమి తర్వాత ధోని కుర్చీ కిందికే నీళ్లొచ్చాయి. అతను తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. అంతకుముందు తుది జట్టు ఎంపిక విషయంలో బోర్డు కలుగజేసుకునేది కాదు కానీ.. ఈ సిరీస్ చివరి మ్యాచ్‌కు ముందు మాత్రం జడేజాపై వేటు వేయాల్సిందేనని ధోనిని హెచ్చరించినట్లు సమాచాం. అందుకే చివరి వన్డేలో జడేజాకు అవకాశం దక్కలేదు. పరిస్థితి చూస్తుంటే జడేజాకు తలుపులు మూసేసినట్లు తెలుస్తోంది. అతడికి తర్వాతి సిరీసుల్లో అవకాశం దక్కేలా లేదు. దేశవాళీల్లో అద్భుతంగా రాణిస్తే తప్ప జడేజా మళ్లీ టీమిండియాలోకి రావడం కష్టమే.