రోహిత్ శర్మ ఎమోషనల్... వీడియో వైరల్!

అది సంతోషంతో కూడిన కంటతడి అయినప్పటికీ.. ఆ ఎమోషన్ వెనుక భారీ ప్లాష్ బ్యాకే ఉంది.

Update: 2024-06-28 04:18 GMT

టీ20 ప్రపంచకప్ లో టీం ఇండియా ఫైనల్ కు చేరుకుంది. గతంలోని చేదు జ్ఞాపకాలు వెంటాడుతూ.. ఓ పక్క ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్న వెళ.. ఆ చేదు జ్ఞాపకాన్ని తమ మనసుల్లో నుంచే కాకుండా.. అభిమానుల మనసుల నుంచీ చెరిపేసే విక్టరీ సాధించారు. రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ బ్యాట్ కు పనిచెప్పగా... కుల్ దీప్, అక్షర్ పటేల్ బంతితో మ్యాజిక్ చేశారు. ఈ సమయంలో రోహిత్ ఎమోషనల్ అయ్యారు.

అవును... టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యారు. అది సంతోషంతో కూడిన కంటతడి అయినప్పటికీ.. ఆ ఎమోషన్ వెనుక భారీ ప్లాష్ బ్యాకే ఉంది. అది తెలియాలంటే... 2022కి వెళ్లాలి. 2022 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కు 169 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది టీం ఇండియా. అయితే... ఛేదనలో సత్తా చాటిన ఇంగ్లాండ్ బ్యాటర్స్ వికెట్ ఏమీ నష్టపోకుండా 16 ఓవర్లలోనే పని పూర్తిచేశారు.

కట్ చేస్తే... అదే టీ20 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ మ్యాచ్. ఇప్పుడు కూడా భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. అప్పటికంటే మూడు పరుగులు ఎక్కువగా (172) లక్ష్యాన్ని నిర్ధేశించింది. అయితే... ఈసారి మాత్రం టీం ఇండియా బౌలర్లు ఇంగ్లిష్ బ్యాటర్స్ కి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. కేవలం 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూల్చారు. ఫలితంగా టీంఇండియా ఫైనల్ కు చేరుకుంది.

ఈ సమయంలో రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కంటతడిపెట్టుకున్నట్లు కనిపించింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ (39 బంతుల్లో 57: 6×4, 2×6) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా... సూర్య కుమార్ యాదవ్ (36 బంతుల్లో 47: 4×4, 2×6) రాణించాడు. అనంతరం కుల్ దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లు తలో మూడు వికెట్లూ పడగొట్టగా.. ఇంగ్లాండ్ ఇంకా 20 బంతులు మిగిలి ఉండగానే చాప చుట్టేసింది!

ఈ ఇన్నింగ్స్ తో ఇంటర్నేషనల్ క్రికెట్ లో 5వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఇండియన్ క్రికెటర్లలో రోహిత్ 5వ స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో ఇప్పటివరకూ వరుసగా... విరాట్ కోహ్లి (12883), మహేంద్రసింగ్ ధోని (11207), మహ్మద్ అజహరుద్దీన్‌ (8095), సౌరబ్ గంగూలీ (7643) అతని కంటే ముందున్నారు.

కొహ్లీపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!:

టీ20 ప్రపంచకప్ 2024లో విరాట్ కొహ్లీ ఫాం పై సందేహాలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. పైగా... ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఉండనుండటంతో... తొలుత బ్యాటింగ్ చేస్తే భారీ స్కోరు చేయాల్సి ఉంటుంది. ఛేజింగ్ చేయాల్సి వస్తే... సఫారీ బౌలర్లను తట్టుకుని నిలబడగలగాలి. ఈ సమయంలో కొహ్లీ ఫాం చాలా ముఖ్యం. ఈ సమయంలో రోహిత్ స్పందించాడు.

ఇంగ్లాండ్ తో తాజాగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కొహ్లీ 9 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో.. కొహ్లీ ఫాం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో స్పందించిన రోహిత్... కొహ్లీ ఫాం పెద్ద సమస్య కాదని.. విరాట్ క్లాస్ ప్లేయర్ అని.. అతని ఆటతీరు అద్భుతం అని తెలిపాడు. ఇదే సమయంలో... ఫైనల్ లోనూ కొహ్లీ ఉంటాడనటంలో సందేహం లేదు.. తుది పోరులో తప్పకుండా కీలక ఇన్నింగ్స్ ఆడతాడనే నమ్మకం ఉందని తెలిపాడు.

Tags:    

Similar News