కోహ్లి.. ఇంకా టెస్టుల్లో అవసరమా?

సచిన్ స్ట్రయిట్ డ్రైవ్.. రోహిత్ పుల్ షాట్.. విరాట్ కోహ్లి కవర్ డ్రైవ్.. భారత క్రికెట్లో వారి ట్రేడ్ మార్క్ గా మిగిలిపోయిన షాట్లు.

Update: 2025-01-04 12:30 GMT

సచిన్ స్ట్రయిట్ డ్రైవ్.. రోహిత్ పుల్ షాట్.. విరాట్ కోహ్లి కవర్ డ్రైవ్.. భారత క్రికెట్లో వారి ట్రేడ్ మార్క్ గా మిగిలిపోయిన షాట్లు. అంత అందగా కొడతారు వారు. కోహ్లి ఫుల్ ఫామ్ లో ఉండగా కవర్ డ్రైవ్ కొడితే ఆ అందమే వేరు.. అలాంటి కోహ్లికి ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్-గావస్కర్ సిరీస్ లో కవర్ డ్రైవ్ పెద్ద బలహీనతగా మారిపోయింది. ఆఫ్‌ స్టంప్‌ అవతల బంతులేసి ఎవరైనా ఔట్‌ చేయొచ్చు అనే అభిప్రాయం నెలకొంది. ప్రస్తుత సిరీస్ లో కోహ్లి 9 ఇన్నింగ్స్‌ ల్లో ఏడు సార్లు ఆఫ్‌స్టంప్‌ ఆవలి బంతులకు ఔటయ్యాడు.

ఒక్కటే 100..

5, 100, 7, 11, 3, 36, 5, 17, 6.. ఇవీ ప్రస్తుత బోర్డర్- గావస్కర్ సిరీస్ లో విరాట్ కోహ్లి స్కోర్లు. మొత్తం 9 ఇన్నింగ్స్ లో 200 పరుగులు. ఇది స్టార్ బ్యాటర్ స్థాయికి ఏమాత్రం తగని ప్రదర్శన. దీంతోనే అతడిపై తీవ్రంగా మండిపడుతున్నారు నెటిజన్లు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లోనూ స్లిప్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బ్యాటింగ్ కు దిగడం, కొన్ని బంతులు ఆడడం.. స్లిప్ లో క్యాచ్ ఇవ్వడం ఇదీ కోహ్లి వరుస. దీంతోనే కోహ్లి లవ్స్ స్లిప్ అంటూ గేలి చేస్తున్నారు.

ఇక తప్పుకో..

తరచూ ఒకేలా ఔట్ అవుతున్నా తన ఆట మార్చుకోకపోవడంపై కోహ్లి మీద అభిమానులు మండిపడుతున్నారు. అతడు రిటైర్ కావాలని సూచిస్తున్నారు. 36 ఏళ్ల వయసులో టెక్నిక్ మార్చుకునే పరిస్థితి రావడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.

రిటైర్ అవుతాడా? కెప్టెన్ అవుతాడా?

కోహ్లి ప్రస్తుతం తీవ్ర ఫామ్ లేమితో ఉన్నాడు. తొలి టెస్టులో సెంచరీ చేసినా అది అనుకూల పరిస్థితుల్లో వచ్చింది. చివరి టెస్టులో అతడు రాణించడం అత్యంత అవసరం. ఎందుకంటే.. రెండో ఇన్నింగ్స్ లో జట్టు 59 పరుగుల వద్ద ఉంది. ఆధిక్యం 63. ఇలాంటి సమయంలో కోహ్లి మంచి ఇన్నింగ్స్ ఆడితే మ్యాచ్ లో భారత్ కే గెలుపు అవకాశాలు ఉండేవి. కానీ, అతడు నిరాశపరిచాడు. మరి రోహిత్ శర్మ తప్పుకొంటే కోహ్లినే టెస్టు కెప్టెన్ అంటున్నారు. అయితే, పరిస్థితి చూస్తే మాత్రం ఆటగాడిగానే జట్టులో చోటు దక్కని విధంగా ఉంది.

వేటు ఖామయా?

కోహ్లి టెస్టు కెప్టెన్సీ సంగతి పక్కనపెడితే.. అతడిని వన్డేలు, టెస్టులకు ఎంపిక చేస్తారా? అనేది పెద్ద ప్రశ్ననే. టి20లకు ఎలాగూ రిటైర్మెంట్ ఇచ్చాడు. వన్డేల్లోనూ కొత్త తరం దూసుకొస్తోంది. టెస్టుల్లో రాణించడం లేదు. దీంతో మొత్తానికి కోహ్లి భవిష్యత్ సందిగ్ధంలోనే ఉంది.

Tags:    

Similar News