బీసీలు మండుతున్నారా ?

బీసీల్లోని కొన్ని ఉపకులాల వాళ్ళు కేసీయార్ పై మండిపోతున్నారని సమాచారం

Update: 2023-07-26 06:10 GMT

బీసీల్లోని కొన్ని ఉపకులాల వాళ్ళు కేసీయార్ పై మండిపోతున్నారని సమాచారం. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే లక్ష ఆర్ధికసాయం అందించటంలో పెట్టిన నిబంధనలే. ఇక్కడ విషయం ఏమిటంటే బీసీల్లోని చేతివృత్తులపై ఆధారపడిన వాళ్ళల్లో పేదలకు లక్ష రూపాయల సాయం అందించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇదే సమయంలో మైనారిటీల్లోని పేదలకు కూడా లక్ష రూపాయల రుణాలను అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంటే రెండు వర్గాల్లోని పేదలకు ప్రభుత్వం తరపున లక్షరూపాయలు అందించే పథకాలు ఒకేసారి ప్రారంభమయ్యాయి.

అయితే పథకాలు ఒకేసారి ప్రారంభమైనా అమల్లోనే చాలా తేడాలున్నట్లు తెలుస్తోంది. ఇపుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే మైనారిటీల్లో పేదలకేమో ఎంతమంది దరఖాస్తు చేసినా లక్ష రూపాయలు ఇచ్చేట్లుగా మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించబోతోంది. ఇదే సమయంలో బీసీల్లో మాత్రం కేవలం 15 ఉపకులాలకు మాత్రమే లక్షరూపాయలు అందించాలని ప్రభుత్వం డిసైడ్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

ఈనెల 15వ తేదీన కరీనంగర్లో బీసీలకు మంత్రి గంగుల కమలాకర్ 15 మందికి చెక్కులను పంపిణీచేశారు. ఇక్కడ తప్ప మరే జిల్లాలోను స్కీము ప్రారంభంకాలేదు. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే బీసీల జనాభా రాష్ట్రంలో 56 శాతముంది. అదే మైనారిటీల జనాభా 14 శాతముంది. జనాభా రీత్యాచూసుకుంటే బీసీల్లో ఎక్కువమందికి పథకం అమలవ్వాల్సింది పోయిన 14 శాతం ఉన్న మైనారిటీల్లో ఎక్కువమందికి పథకం అమలు చేయాలని కేసీయార్ ప్రభుత్వం నిర్ణయించటమే విచిత్రంగా ఉంది. దీన్నే బీసీల్లోని కులవృత్తుల సంఘాల నేతలు మండిపోతున్నారు.

బీసీల్లో కీలకమైన గౌడ్, పద్మశాలి, యాదవ ఉపకులాల్లోని పేదలను తాజా పథకంలో ప్రభుత్వం చేర్చలేదు. బీసీల్లో 112 ఉపకులాలుంటే అందులో 15 ఉపకులాలకు మాత్రమే పథకాన్ని వర్తింపచేయటం ఏమిటి ? అనేది బీసీల నుండి ఎదురవుతున్న ప్రశ్న. మైనారిటి కుటుంబాల సంఖ్య సుమారు 7 లక్షలుంటే బీసీ కుటుంబాల సంఖ్య 47 లక్షలున్నాయి. అయితే ప్రభుత్వ నిర్ణయం వల్ల కేవలం 5 లక్షల కుటుంబాలకు మత్రమే లబ్దిదొరుకుతుందని అంచనా.

బీసీల్లోని ఉపకులాలకు సాయం అందించేందుకు ప్రభుత్వం రు. 5280 కోట్లు కేటాయిస్తే, మైనారిటీల సాయం కోసం రు. 6 వేల కోట్లు కేటాయించింది. ఆర్ధిక పరిస్ధితి ఇబ్బందిగా ఉన్న కారణంగానే ప్రభుత్వం బీసీల్లోని కొందరికే సాయాన్ని పరిమితం చేస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం.

Tags:    

Similar News