బ్రేకింగ్ : దేశంలో నీట్ పరీక్షలు వాయిదా

Update: 2021-05-03 10:36 GMT
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీనితో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ , కర్ఫ్యూ అమలు అవుతుంది. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు ఇప్పటికే పలు పరీక్షలని రద్దు చేశాయి. మరికొన్ని రాష్ట్రాలు పరీక్షలని వాయిదా వేస్తూ , కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాత పరీక్షల తేదీలు ప్రకటిస్తాం అంటూ ప్రకటనలు విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో నీట్ పరీక్షలను మరో నాలుగు నెలలపాటు వాయిదా వేయాలని  ప్రధాన మంత్రి కార్యాలయం కీలక నిర్ణయం తీసుకొంది.  

దీనితో ఇక ,ఈ ఏడాది ఆగష్టు 31కి ముందు పరీక్షలు నిర్వహించరు.  మెడికల్ కాలేజీల్లో ఆడ్మిషన్ల కోసం నీట్ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఆయా కాలేజీల్లో  అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు. కరోనా నేపథ్యంలో పరీక్షా నిర్వహణ అధికారులతో చర్చలు జరిపిన ప్రభుత్వం , ఆ తర్వాత నిర్వహణ కష్టం అని భావించి నాలుగు నెలల పాటు వాయిదా వేసింది. . నాలుగు నెల‌ల త‌ర్వాత ఉన్న ప‌రిస్థితుల‌ను రివ్యూ చేసి… ప‌రీక్ష కొత్త తేదీల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. దేశంలో ఇప్పటికే సీబీఎస్ ఈ టెన్త్ పరీక్షలను రద్దు చేశారు.12వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రాల యూనివర్శిటీలు పరీక్షలను రద్దు చేశాయి. చాలా రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలను రద్దు చేశారు. కరోనా విజృంభణ ఇలాగే మరికొన్ని రోజులు కొనసాగితే  పరీక్షలు నిర్వహించని విద్యార్థులను ప్రమోట్ చేసే అవకాశం ఉంది.
Tags:    

Similar News