'సలార్' రిలీజ్ రోజు 300 ద‌ర్శ‌కుడి విజువ‌ల్ ఫీస్ట్!

ఎపిక్ స్పేస్-ఒపెరా జానర్‌లో స్నైడర్ తెర‌కెక్కించిన `రెబెల్ మూన్: పార్ట్ వన్ - ఎ చైల్డ్ ఆఫ్ ఫైర్` ట్రైల‌ర్ ఇంత‌కుముందే విడుద‌లైంది.

Update: 2023-12-18 05:13 GMT

300 ద‌ర్శ‌కుడు జాక్ స్నైడ‌ర్ ఓ సినిమా తెర‌కెక్కిస్తున్నారు! అంటే దానిపై భారీ అంచ‌నాలుంటాయి. అత‌డి సినిమాల భారీత‌నం.. క‌ళ, సినిమాటోగ్ర‌ఫీ, యాక్ష‌న్ ఇలా అన్ని సాంకేతిక అంశాల్లో ఏదో ఒక ప్ర‌త్యేక‌త ఉంటుంది. ముఖ్యంగా విజువ‌ల్ గ్రాఫిక్స్ లో అత‌డు కొత్త ప్ర‌పంచాల్ని సృజించ‌డంలో ఎంతో ప్ర‌తిభావంతుడు. ఇక అత‌డి సినిమాల్లో సంభాష‌ణ‌ల డెప్త్ కూడా క‌ట్టి ప‌డేస్తుంది. ఇప్పుడు అత‌డి నుంచి స‌రికొత్త సినిమా వ‌స్తోంది. అది కూడా ప్ర‌భాస్ న‌టించిన స‌లార్ రిలీజ్ రోజున ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి వ‌స్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

ఎపిక్ స్పేస్-ఒపెరా జానర్‌లో స్నైడర్ తెర‌కెక్కించిన `రెబెల్ మూన్: పార్ట్ వన్ - ఎ చైల్డ్ ఆఫ్ ఫైర్` ట్రైల‌ర్ ఇంత‌కుముందే విడుద‌లైంది. ఈ ట్రైల‌ర్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే విజువ‌ల్స్ మైమ‌రిపించాయి. తాజాగా ఈ సిరీస్ కి ముంద‌స్తు స‌మీక్ష‌లు వెలువ‌డ‌గా, ప్రతికూల సమీక్షలను అందుకుంది. డిసెంబరు 21న విడుదలైన ఈ చిత్రం గ‌జిబిజీగా ఉంద‌ని, ప్లాట్ లైన్ పొంత‌న లేకుండా పోయింద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి.

ఇందులో సోఫియా బౌటెల్లా, చార్లీ హున్నామ్, మైఖేల్ హుయిస్‌మాన్, జిమోన్ హౌన్‌సౌ, డూనా బే, రే ఫిషర్, క్లియోపాత్రా కోల్‌మన్ త‌దిత‌రులు న‌టించారు. మార్వ‌ల్ సినిమాల త‌ర‌హాలోనే ఆవరణ మదర్‌వరల్డ్ లోని అవినీతి ప్రభుత్వం ఆధిపత్యం వహించే విశ్వం నేప‌థ్యంలో ఒక యూనిక్ స్టోరీతో రూపొందింది. ఈ ప్ర‌పంచంలో చంద్రుడు ఇంపీరియం శక్తుల నుండి భయంకరమైన ముప్పును ఎదుర్కొంటాడు. విముక్తి కోరుతూ ఇంపీరియం మాజీ సభ్యుడు బౌటెల్లా అనుచ‌రుడు కోరా త‌మ‌ గ్రహం మీదకు తిరిగి రాకముందే అణచివేత పాలనకు వ్యతిరేకంగా నిలబడటానికి గెలాక్సీ అంతటా యోధులను నియమించే కష్టత‌ర‌మైన పనిని తీసుకుంటుంది.

ఈ చిత్రంపై వ‌చ్చిన‌ 42 సమీక్షల ఆధారంగా రోటెన్ టొమాటోస్‌లో కేవ‌లం 24 శాతం రేటింగ్‌ను సాధించింది. విమ‌ర్శ‌కుల్ని ఈ సినిమా మెప్పించ‌లేక‌పోయింది ``రెబెల్ మూన్: పార్ట్ వన్ - ఎ చైల్డ్ ఆఫ్ ఫైర్` లో 300 ఫేం జాక్ స్నైడర్ తన విజువల్ ట్రీట్ ని కోల్పోలేదని నిరూపించాడు. అయితే ర‌క‌ర‌కాల మూస‌ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ క‌థ‌లతో రూపొందించిన మ‌రో కథాంశం తీసుకుని, స‌రిగా ఎగ్జిక్యూట్ చేయ‌లేదు అని విమ‌ర్శ‌లొచ్చాయి. విజువ‌ల్స్ అద్భుతంగా ఉన్నా కానీ ఏదో లోపం వెంటాడింద‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ‌. నిజంగా అగ్లీగా భావించే కళంకం కలిగించే థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఇది స్ఫూర్తి లేని `స్టార్ వార్స్` నాక్ ఆఫ్‌గా ఒక క్రిటిక్ అభివర్ణించాడు. అత్యంత ఖరీదైనది.. కానీ స్ఫూర్తి లేని `స్టార్ వార్స్` అని ఆయన వ్యాఖ్యానించారు. రెబెల్ మూన్ మానవ పాత్రలు, భావోద్వేగాలతో కూడిన వాస్తవ చిత్రం కంటే యానిమేటెడ్ పిచ్ లాగా ఉంది.. అని మ‌రో క్రిటిక్ రాసారు. ఏకీకృత అంశం లేని చాలా ర‌కాల కాపీ స్టోరీబోర్డుల సమాహారంగా ఈ చిత్రం గంద‌ర‌గోళంగా ఉంద‌ని కూడా ఒక ప్ర‌ముఖ విమ‌ర్శ‌కుడు విమ‌ర్శించారు.

Full View
Tags:    

Similar News