నా ప్రేమను కాదన్నాడని నెలలు ఏడ్చాను : పాయల్‌

ఆర్‌ఎక్స్ 100 సినిమా తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్‌.

Update: 2023-11-08 05:00 GMT

ఆర్‌ఎక్స్ 100 సినిమా తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్‌. ఈ అమ్మడు హాట్ ఐటం సాంగ్స్ చేయడం తో పాటు వరుసగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూనే ఉంది. వెబ్‌ సిరీస్ ల్లో కూడా ఈ అమ్మడు తన సత్తా చాటుతూ ఉంది. తాజాగా ఈ అమ్మడు 'మంగళవారం' అనే హర్రర్‌ జోనర్ సినిమాలో నటించింది.

పాయల్‌ కి హీరోయిన్‌ గా గుర్తింపు తెచ్చి పెట్టిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మంగళవారం రూపొందింది. వచ్చే వారంలో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాయల్ రాజ్ పూత్‌ పాల్గొంటూ ఉంది. తనకు దక్కుతున్న పాత్రలు మరియు సినిమాల పట్ల చాలా సంతృప్తిగా ఉన్నట్లుగా పేర్కొన్న పాయల్‌ వ్యక్తిగత విషయాల గురించి స్పందించింది.

ప్రేమ విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సందర్భంగా పాయల్ స్పందిస్తూ... స్కూల్‌ డేస్ లో ఒక అబ్బాయిని చూడగానే తెలియని ఫీల్ కలిగింది. అతడిని చూస్తే ఆనందం కలిగేది. అది ప్రేమగా నేను భావించాను. అదే విషయాన్ని అతడికి చెప్పాను. కానీ అతడు నా ప్రేమను తిరస్కరించాడు. తనకు ప్రేమపై ఆసక్తి లేదని చెప్పడంతో షాక్ అయ్యాను.

అతడు నా ప్రేమను తిరస్కరించడంతో చాలా నెలల తరబడి ఏడ్చాను. చదువుపై శ్రద్ద పెట్టలేక పోవడంతో ఆ ఏడాది పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యాను. ఆ విషయాన్ని అమ్మకి చెప్పాను. ఆమె నాకు మద్దతుగా నిలిచింది. నేను తిరిగి పూర్వ పరిస్థితికి వచ్చేందుకు సహాయపడింది. ఆమె మాటలు నాలో కొత్త ఉత్సాహం ను నింపాయి.

అప్పటి నుంచి ప్రేమ జోలికి వెళ్లకుండా చదువు మరియు కెరీర్ పై దృష్టి పెట్టినట్లు పేర్కొంది. ఇప్పుడు మళ్లీ పాయల్‌ ప్రేమలో ఉందనే వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయమై పాయల్ స్పందించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆమె కచ్చితంగా రిలేషన్ లో ఉందని మాత్రం చాలా మంది బలంగా వాదిస్తున్నారు. అసలు విషయం ఏంటో ఆమె చెప్పాల్సి ఉంది.

Tags:    

Similar News