శోభిత గ్లామర్ ట్రీట్.. ఈసారి ఔట్ స్టాండింగ్
ఇక అడవి శేష్ మేజర్ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి.. ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది
శోభితా ధూళిపాళ్ల.. ఈ పేరు తెలియని మూవీ లవర్స్ బహుశా ఉండరేమో. ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన ఈ అమ్మడు.. ఇప్పుడు హాలీవుడ్ లో కూడా ఆఫర్లు దక్కించుకుంటూ తన సత్తా చాటుతోంది. తెనాలి ముద్దుగుమ్మ అయిన శోభిత.. బాలీవుడ్ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2016లో రామన్ రాఘవ్ 2.0 మూవీతో తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకుంది.
ఇక అడవి శేష్ మేజర్ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి.. ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. కేవలం బాలీవుడ్, టాలీవుడే కాకుండా.. మిగతా భాషల్లో సినిమాలు చేసింది. మలయాళ, తమిళ చిత్రాల్లో నటించి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. పొన్నియన్ సెల్వన్ రెండు పార్టుల్లో మహారాణిగా ఆకట్టుకుంది.
ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తుంటోంది. డైలీ అప్డేట్స్ ఇస్తూ తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. క్రేజీ ఔట్ ఫిట్స్ లో కిక్కిచ్చే పోజులు ఇస్తుంటోంది. రకరకాల స్టిల్స్ తో కుర్రకారును మైమరపిస్తుంటోంది. చీరల్లో నెట్టింట హీట్ పుట్టిస్తుంటోంది. చీరల్లో కూడా గ్లామర్ షో చేయొచ్చని ప్రూవ్ చేస్తుంటోంది.
తాజాగా ఈ బ్యూటీ ఇంగ్లీష్ బ్రైడ్స్ టుడే మ్యాగ్ జైన్ పై దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ విషయాన్ని శోభిత రీ పోస్ట్ చేసింది. దాంతోపాటు కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో వైట్ కలర్ డిజైనర్ ఫ్రాక్ లో తన పోజులతో కుర్రకారు గుండెల్లో హీట్ పుట్టిస్తోంది. మత్తెక్కించే కళ్లతో కైపుగా చూస్తూ క్లీన్ బౌల్డ్ చేస్తోంది. ఔట్ స్టాండింగ్ స్టిల్స్ తో నెటిజన్లు కట్టి పడేస్తోంది. ఎద అందాలు చూపిస్తూ ఫిదా చేస్తోంది.
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా శోభిత అందాలకు పక్కాగా ఫిదా అవ్వాల్సిందేంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. తమ కామెంట్లతో బ్యూటీని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. శోభిత గ్లామర్ కు హాలీవుడ్ టు టాలీవుడ్ అంతా ఫ్యాన్సేనని అంటున్నారు.