వ‌హ్ వాణీ..క‌పూర్ అందం మెరుపులా!

ఎప్ప‌టిక‌ప్పుడు వాణీలో వేడిని ఆవిష్క‌రిస్తూ ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ ని అంత‌కంత‌కు రెట్టింపు చేసుకుంటుంది.

Update: 2024-08-17 19:30 GMT

బాలీవుడ్ బ్యూటీ వాణీకపూర్ ఇన్ స్టాని హీటెక్కించడంలో తనదైన మార్క్ వేస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు సొగ‌సైన‌ ఫోటోలతో మంటలు రేప‌డం సొగ‌స‌రి ప్ర‌త్యేక‌త‌. ఆల్ట్రా మోడ్ర‌న్ దుస్తుల్లోనూ అగ్గిరాజేస్తుంది. మార్కెట్ లో న్యూ ట్రెండ్స్ ని ప‌రిచ‌యం చేయ‌డంలోనూ ముందుంటుంది. బాలీవుడ్ భామ‌లంద‌రి కంటే వాణీ క‌పూర్ ఆ లిస్ట్ లో ముందు వ‌రుస‌లో ఉందంటే? అతిశ‌యోక్తి కాదు. ఎప్ప‌టిక‌ప్పుడు వాణీలో వేడిని ఆవిష్క‌రిస్తూ ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ ని అంత‌కంత‌కు రెట్టింపు చేసుకుంటుంది.

తాజాగా అమ్మ‌డు మ‌రోసారి బాడీకార్న్ దుస్తుల్లో మురిపించింది. బ్లూ క‌ల‌ర్ ప‌ర్పెక్ట్ ఔట్ ఫిట్ త‌ళుకు లీనింది. డిజైన్ మ‌ధ్య‌లో హిప్ మూవ్ మెంట్ ని హైలైట్ చేస్తూ అంద‌మైన పువ్వుతో ఇచ్చిన ఇండికేష‌న్ సంథింగ్ స్పెష‌ల్ గా నిలిచింది. ఇక హెయిర్ స్టైల్ మాత్రం అన్నింటిని మించి హైలైట్ అయింది. సంప్ర‌దాయ జ‌డ అందాన్ని కాస్త స్టైలిష్ గా ట్రై చేసింది. కాళ్ల‌కు హైహీల్స్ ధ‌రించడంతో మ‌రింత ఎత్తుగా హైలైట్ అవుతుంది.

బ్లాక్ అండ్ వైట్ కాంబినేష‌న్ బ్యాక్ డ్రాప్ లో అమ్మ‌డి ఫోటో సోష‌న్ అద్భుతం. నెక్ ని క్లీన్ గా ఉంచుతూ.. .చెవుల‌కు అంద‌మైన దిద్దుల‌తో అలంక‌రించింది. ఇక రూప‌లావ‌ణ్యంలో ఎలాంటి మార్పులు లేవు. ఇండ‌స్ట్రీకొచ్చిన ఆరంభంలో ఇప్ప‌టికీ అదే బ్యూటీని మెయింటెన్ చేస్తుంది. ఈ విష‌యంలో క‌పూర్ బ్యూటీ ని గ్రేట్ అనాల్సిందే. వ‌య‌సు చెప్పుకోవ‌డానికి పెరుగుతుంది త‌ప్ప‌! త‌న బ్యూటీకి కాద‌ని మరోసారి ప్రూవ్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

క‌పూర్ బ్యూటీని అభిమానులు ఇలా చూసి చాలా రోజుల‌వుతుంది. దీంతో అమ్మ‌డిపై అభిమానమంతా కామెంట్ల రూపంలోతెలియ‌జేస్తున్నారు. ఇక అమ్మ‌డి కెరీర్ సంగతి చూస్తే గ‌త ఏడాది ఖాళీగానే ఉంది. ఈ ఏడాది మాత్రం `ఖేల్ ఖేల్ మే` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. `రెయిడ్ -2` షూటింగ్ కూడా పూర్తి చేసింది. మ‌రో సినిమా ఆన్ సెట్స్ లో ఉంది.

Tags:    

Similar News