జ‌గ‌న్ తో స్టార్ హీరో..ఏం దూకుడు బాస్!

బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ పుల్ స్వింగ్ లో ఉన్నాడు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు;

Update: 2024-05-28 06:00 GMT

బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ పుల్ స్వింగ్ లో ఉన్నాడు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు. ఇటీవ‌లే 'షైతాన్'..'మైదాన్' లో రెండు విజ‌యాలు ఖాతాలో వేసుకున్నాడు. ఇంకా లైన‌ప్ లో చాలా ప్రాజెక్ట్ లే ఉన్నాయి. వాటిలో కొన్ని సెట్స్ లో ఉంటే..మ‌రికొన్ని సెట్స్ కి వెళ్లాల్సిన‌వి మ‌రికొన్ని. అయినా త‌గ్గేదేలే అంటూ కొత్త సినిమాల‌కు క‌మిట్ అవుతున్నాడు. తాజాగా 'మిష‌న్ మంగ‌ళ్' చిత్రంతో భారీ విజ‌యం అందుకున్న ద‌ర్శ‌కుడు జ‌గ‌న్ శ‌క్తితోనూ కొత్త సినిమాకి క‌మిట్ అయ్యాడు.

గత కొన్ని రోజులుగా ఇద్ద‌రి మ‌ధ్య స్టోరీ డిస్క‌ష‌న్స్ న‌డుస్తున్నాయి. తాజాగా జ‌గ‌న్ వినిపించిన క‌థ న‌చ్చ‌డంతో అజ‌య్ స్టోరీ లాక్ చేసిన‌ట్లు స‌మాచారం. ఇది డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అని వినిపిస్తుంది. అజ‌య్ దేవ‌గ‌ణ్ మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని జ‌గ‌న్ మార్క్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొంద‌నుంద‌ని తెలుస్తోంది. తొలి సినిమా మిష‌న్ మంగ‌ళ్ తో జ‌గ‌న్ శ‌క్తి తానేంటో నిరూపించాడు. మిష‌న్ మార్స్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా భార‌తీయ ప్రేక్ష‌కుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్న గొప్ప చిత్రంగా నిలిచింది. అజ‌య్ తో అలాంటి యూనిక్ పాయింట్ ఒక‌టి ట‌చ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈసారి క‌మ‌ర్శియ‌ల్ యాంగిల్ లో క‌థ‌ని తీర్చి చెప్ప‌బోతున్నాడుట‌. ఈ చిత్రాన్ని 2025 లో ప్రారంభించాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. స్టోరీకి సంబంధించి ఇంకా పూర్తి చేయాల్సిన ప‌నులు కొన్ని ఉన్నాయ‌ట‌. అలాగే ప్ర‌స్తుతం అజ‌య్ దేవ‌గ‌ణ్ చాలా సినిమాల‌తో బిజీగానూ ఉన్నారు.

'దేదే ప్యార్ దే-2', 'రెయిడ్-2', 'స‌న్నాఫ్ స‌ర్దార్ -2',' సింగం ఎగైన్' లాంటి సీక్వెల్స్ లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఇవ‌న్నీ షూటింగ్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసుకునే స‌రికి స‌మ‌యం ప‌డుతుంది. అందుకే జ‌గ‌న్ శ‌క్తి ప్రాజెక్ట్ ని 2025 లో మొద‌లు పెట్ట‌బోతున్నారు. ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో నిర్మించేందుకు బాలీవుడ్ లో ప‌లు ప్రొడ‌క్ష‌న్ హౌస్ ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారుట‌. ఏ నిర్మాణ సంస్థలో ఈ సినిమా ప‌ట్టాలెక్కుతుంది? అన్న దానిపై మాత్రం ఇంకా ఎలాంటి స‌మాచారం లేదు.

Tags:    

Similar News