భార్య ప‌ప్పు చేస్తే భ‌ర్త ప‌రార్!

నాన్ వెజ్ ప్రియుల ముందు వెజ్ క‌ర్రీలు పెడితే? ముద్ద దిగే ప‌రిస్థితి ఉండ‌దు. కంచం ముందు న‌చ్చిన నాన్ వెజ్ క‌ర్రీ లేక‌పోతే? శివ తాండవం అడేసే భ‌ర్త‌ల గురించి అప్పుడ‌ప్పుడు పేప‌ర్లో చ‌దువుతుంటాం.;

Update: 2025-03-24 03:34 GMT

నాన్ వెజ్ ప్రియుల ముందు వెజ్ క‌ర్రీలు పెడితే? ముద్ద దిగే ప‌రిస్థితి ఉండ‌దు. కంచం ముందు న‌చ్చిన నాన్ వెజ్ క‌ర్రీ లేక‌పోతే? శివ తాండవం అడేసే భ‌ర్త‌ల గురించి అప్పుడ‌ప్పుడు పేప‌ర్లో చ‌దువుతుంటాం. తాజాగా బాలీవుడ్ జోడీ అలియాభ‌ట్-ర‌ణ‌బీర్ క‌పూర్ క‌థ కూడా దాదాపు అలాగే ఉంది. అలియాభ‌ట్ కి ప‌ప్పు అంటే ఇష్ట‌మ‌ట‌. రోజు తినే భోజ‌నంలో త‌ప్ప‌కుండా ప‌ప్పు ఉండాల్సిందేన‌ట‌.

బేసిక్ గా ఆమె శాఖాహారి కావ‌డంతో డైనింగ్ టేబుల్ ముందు ఎన్ని ర‌కాల వెజ్ క‌ర్రీలు ఉన్నా? ప‌ప్పు మాత్రం త‌ప్ప‌నిస‌రి అట‌. పప్పు-నెయ్యి కాంబినేష‌న్ చిన్న‌ప్ప‌టి నుంచి బాగా అలవాటు కావ‌డంతో? ఇప్ప‌టికీ అలాగే కంటున్యూ అవుతుందిట‌. కుమార్తె రాహాకి కూడా అలాగే అలావాటు చేస్తుందిట‌. అయితే ర‌ణ‌బీర్ క‌పూర్ రోజు ప‌ప్పు చూస్తే తిన‌కుండా ఎస్కేప్ అయిపోతాడుట‌. డైటింగ్ లో ఉన్నాన‌ని ఆక‌లి వేస్తున్నా? తిన‌డుట‌.

అప్పుడ‌ప్పుడు ప‌ప్పు ఒకే గానీ...రోజు టేబుల్ పై పప్పు చూస్తే మాత్రం ముఖం మాడ్చుకుంటాడ‌ని అలియాభ‌ట్ తెలిపింది. ర‌ణ‌బీర్ క‌పూర్ నాన్ వెజ్ ప్రియుడు. ముక్క‌లేనిదే ముద్ద దిగ‌ని టైప్. డైలీ త‌క్కువ మోతాదులో మాంసాహారం తీసుకుంటాడుట‌. ఉద‌యం బ్రేక్ పాస్ట్ నుంచి మ‌ధ్నాహ్నాం, రాత్రి పూట త‌ప్ప‌కుండా నాన్ వెజ్ ఉండాల్సిందేట‌. ఏదైనా సినిమాకు అవ‌స‌ర‌మైనప్పుడు లుక్ ప‌రంగా అవ‌స‌ర‌మైతే? నాన్ వెజ్ కి దూరంగా ఉంటాడుట‌.

అయితే ఆమ‌ధ్య రామ‌య‌ణం సినిమా మొద‌లు పెట్టిన నుంచి రిలీజ్ వ‌ర‌కూ మాంసాహారం, మ‌ద్యం ముట్టుకోన‌ని అన్నాడు. కానీ సినిమా సెట్స్ లో ఉన్న స‌మ‌యంలో ఓ పార్టీలో ఆ రెండు ఆర‌గించ‌డం అప్ప‌ట్లో అత‌డిపై విమ‌ర్శ‌లు కూడా వ్య‌క్త‌మైన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News