హైట్ చూపించి ఇలా రివర్స్ అయ్యావా అలియా?
తాజాగా అలియాభట్ ఇన్ స్టాలో ఓ ఫోటో షేర్ చేసింది. అందులో అలియాభట్ చాలా ఎత్తులో ఓ అపార్ట్ మెంట్ బాల్కనీలో ఓ ఫోటో దిగి పోస్ట్ చేసింది.
బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ మాతృమూర్తిగానూ బాధ్యతలు నెరవేరుస్తోన్న సంగత తెలిసిందే. రణబీర్ కపూర్ తో వివాహం అంటుపై తల్లిగా ప్రమోషన్ రావడం అన్నీ చాలా వేగంగా జరిగిపోయాయి. ఆ విషయంలో అలియాభట్ ఎంతో లక్కీ అనాలి. అంత పెద్ద హీరోయిన్ అయినా 31 ఏళ్లకే అన్ని రకాల బాద్యతల దగ్గరుండి చూసుకుంటుంది. ఓ వైపు భర్తకు సేవలు చేసుకుంటూనే బిడ్డ బాధ్యతల కోసం అంతే సమయాన్ని వెచ్చిస్తుంది. అలాగని ప్రోషెషన్ న్ లైట్ తీసుకోలేదు.
సినిమాల కోసం ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకెళ్తుంది. మరి వీటన్నింటిని ఉపసమనం పొందేది ఎలా అంటే? ఇంట్లో చిన్న పిల్లలుంటే అంతకు మించి ఉపశమనం ఎక్కడ దొరుకుతుంది. అలియాభట్ ఇప్పుడు ఇంటికెళ్తే కుమార్తె రోహోతో ఆడుకుంటూ రిలాక్స్ అవుతుంది. రోహా అంటే అలియాకి ఎంత ఇష్టం అన్నది మాటల్లో చెప్పలేనిది. తల్లి ప్రేమకి కొలమానం ఎక్కడ ఉంటుంది. రోహా విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. ఇక పాపాయి ఒక్క క్షణం కూడా వదిలి పెట్టకుండా కంటికి రెప్పలా చూసుకుంటుంది.
అయితే పిల్లలు ఏ వయసులో నేర్చుకోవాల్సింది అప్పుడే నేర్చుకుంటేనే షైన్ అవుతారు. కానీ అతి గారం చేస్తే ఎలాంటి ఫలితాలుంటాయో కూడా తెలిసిందే. అయితే అలియా కుమార్తె విషయంలో కాస్త అతి చేస్తున్నట్లే కనిపిస్తుందని ఇంట్లో అమ్మనాన్నల నుంచి ఫిర్యాదులొస్తున్నట్లు కనిపిస్తుంది. పిల్లల్ని సొంతంగా నడక నేర్చుకో వాలని...పడిపోతారని వాళ్లను పట్టుకుంటే ఎప్పటికీ నడక రాదనే అలియాకి సూచించినట్లు తెలుస్తోంది. కానీ వాళ్ల మాటల్ని పెడ చెవిన పెట్టి అలియా పాపాయి విషయంలో అందుకు ఛాన్సే లేకుండా చేస్తున్నట్లు కనిపిస్తుంది.
తాజాగా అలియాభట్ ఇన్ స్టాలో ఓ ఫోటో షేర్ చేసింది. అందులో అలియాభట్ చాలా ఎత్తులో ఓ అపార్ట్ మెంట్ బాల్కనీలో ఓ ఫోటో దిగి పోస్ట్ చేసింది. అక్కడ నుంచి కిందకు ఎంత దూరం ఉంటుందో? చూస్తేనే కళ్లు తిరుగుతుంది. అయితే ఈ ఫోటోతో తనకి సలహాలిచ్చిన వారికి ఎవరికైనా ఇలా ఇండికేషన్ ఇచ్చిందా? అన్నది సందేహం. ఇందులో అలియాభట్ వైట్ బినియన్..బ్లాక్ ప్యాంట్ లో కనిపిస్తుంది. సపోర్టింగ్ గ్లాస్ వాల్ వెనుకవైపుగా నుంచుని పై రెండు చేతులు చాచి కెమెరాకి ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.