బాల‌య్య స్వ‌ర్ణోత్స‌వంలో మెగా-అల్లు ఫ్యామిలీలు!

సోష‌ల్ మీడియాలో మెగా-అల్లు ఫ్యామిలీల మ‌ధ్య ర‌చ్చ ఏ రేంజ్ లో సాగుతుందో తెలిసిందే.

Update: 2024-08-29 06:23 GMT

సోష‌ల్ మీడియాలో మెగా-అల్లు ఫ్యామిలీల మ‌ధ్య ర‌చ్చ ఏ రేంజ్ లో సాగుతుందో తెలిసిందే. `మా నాన్న కోసం నేను ఎక్క‌డికైనా వ‌స్తా` అని బ‌న్నీ న‌ర్మ‌గ‌ర్బంగా మాట్లాడ‌టంతో? స‌న్నివేశం మ‌రింత ర‌స‌వ‌త్తరంగా మారింది. రెండు ఫ్యామిలీల అభిమానుల మ‌ధ్య త‌గ్గాఫ్ వార్ న‌డుస్తోంది. ఆ రెండు ఫ్యామిలీల మ‌ధ్య నిజంగా వైరం? ఉందా? లేదా? అన్న సంగ‌తి ప‌క్క‌న‌బెడితే! బ‌య‌ట మాత్రం పెద్ద రాజ‌కీయ‌మే నడుస్తోంది.

స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో న‌ట‌సింహ బాల‌కృష్ణ పేరిట తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ స్వ‌ర్ణ‌త్స‌వాలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. బాల‌య్య ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 50 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ఈవేడుక‌లు నిర్వ‌హిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 1వ తేదీన హైద‌రాబాద్ లో ఈ వేడుక ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీ పెద్ద‌ల్ని అంద‌ర్నీ ఆహ్వానించ‌డం జ‌రిగింది. ప‌రిశ్ర‌మ‌లోని వివిధ శాఖ‌ల‌కు చెందిన ప్ర‌ముఖులు స్వ‌యంగా వెళ్లి చిరంజీవిని స‌హా హీరోలంద‌ర్నీ ఆహ్వానించారు.

అలాగే అల్లు అర‌వింద్ ఫ్యామిలీని, బ‌న్నీని కూడా ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. ఈ నేప‌థ్యంలో చిరంజీవి స‌హా అంతా హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. అలాగే ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూడీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా హాజ‌ర‌య్యే అవ‌కాశాలున్నాయి. అయితే నెట్టింట మెగా-అల్లు ఫ్యామిలీ హీరోల మ‌ధ్య వార్ అనంత‌రం జ‌రుగుతోన్న మొట్ట మొద‌టి వేడుక‌కు ఆయా హీరోలు హాజ‌ర‌వ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారుతుంది.

వేదిక‌పై ఆ రెండు ఫ్యామిలీ హీరోల మ‌ధ్య ఎలాంటి స‌న్నివేశాలు చోటు చేసుకుంటాయి? అన్న‌ది ఉత్కంఠ‌గా మారింది. బాల‌య్య తో అల్లు అర‌వింద్ ఎంతో స్నేహంగా ఉంటారు. అర‌వింద్ ఓటీటీ ప్లాట్ ఫాం లో `ఆహా`ని హోస్ట్ చేస్తుంది కూడా బాల‌య్యే. ఏపీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో నంద‌మూరి, నారా ఫ్యామిలీల‌తో మెగా ఫ్యామిలీ బాండింగ్ మ‌రింత స్ట్రాంగ్ అయిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News