బన్నీ ఒక్కో సినిమాకి ఇంత గ్యాప్ తీసుకున్నాడా?

ఇదిలా ఉంటే గత కొంతకాలంగా అల్లు అర్జున్ ఒక సినిమా నుంచి మరో సినిమాకి తీసుకున్న టైమ్ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

Update: 2023-12-04 10:45 GMT

'పుష్ప' మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకుంది. ఇక రీసెంట్ గా ఈ మూవీలో బన్నీ నటనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం 'పుష్ప 2' తో తన క్రేజ్ ని మరింత పెంచుకునే పనిలో ఉన్నాడు ఐకాన్ స్టార్. 'పుష్ప 2' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత కూడా బన్నీ చేయబోయే ప్రాజెక్ట్స్ అన్నీ బడా డైరెక్టర్ తో ఉండడం విశేషం.

ఇదిలా ఉంటే గత కొంతకాలంగా అల్లు అర్జున్ ఒక సినిమా నుంచి మరో సినిమాకి తీసుకున్న టైమ్ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.. కెరియర్ స్టార్టింగ్ లో ఒక సినిమా చేసి మరో సినిమా సెట్స్ ని తీసుకెళ్ళేందుకు తక్కువ సమయం తీసుకున్న బన్నీ ఈ మధ్యకాలంలో కాస్త ఎక్కువ టైం తీసుకున్నాడు. ముఖ్యంగా 'సరైనోడు' సినిమా నుంచి బన్నీ ప్రతి సినిమాకి ఎక్కువ సమయాన్ని కేటాయించాడు.

సరైనోడు నుంచి 'దువ్వాడ జగన్నాధం' సినిమా చేసేందుకు బన్నీకి పట్టిన సమయం 428 రోజులు. ఇక 'దువ్వాడ జగన్నాథం' నుంచి 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాకి 316 రోజులు పట్టింది. 'నా పేరు సూర్య' నుండి 'అలవైకుంఠపురంలో' సినిమాకైతే ఏకంగా 619 రోజుల టైం పట్టింది. 'అలవైకుంఠపురములో' నుంచి 'పుష్ప' కి 706 రోజులు పడితే 'పుష్ప' నుండి 'పుష్ప 2' కి ఏకంగా 973 రోజుల సమయం పట్టింది.

వీటిల్లో అలవైకుంఠపురంలో, పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్ సినిమాలకి బన్నీ ఎక్కువ టైం తీసుకోవడం గమనార్హం. ఈ సినిమాలకు ఎక్కువ సమయం కేటాయించినా వాటితోనే బన్నీ పాపులారిటీ భారీగా పెరిగింది. అయితే ఫ్యాన్స్ మాత్రం కనీసం ఏడాదికి ఒక సినిమా అయినా రిలీజ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో బన్నీ చేయబోయే ప్రాజెక్ట్స్ విషయంలో ఇదే ఫాలో అవుతాడా? లేక తక్కువ సమయంలో కంప్లీట్ చేసి అభిమానులను అలరిస్తాడా? అనేది చూడాలి.

ఇక 'పుష్ప2' విషయానికొస్తే.. సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పార్ట్-1 భారీ సక్సెస్ అందుకోవడంతో 'పుష్ప 2' విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా సుకుమార్ ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News