అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. టాలీవుడ్ లోనే టాప్

తెలుగులో ప్రభాస్, ఎన్టీఆర్, మహేశ్ బాబు లాంటి ఇతర స్టార్ హీరోలు కన్నా ఎక్కువ మొత్తంలో తీసుకోబోతున్నారని తెలిసింది.

Update: 2023-08-29 12:53 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇది పేరు కాదు ఓ బ్రాండ్. సెల్ఫ్ మేడ్ పాన్ ఇండియా స్టార్. పుష్ప చిత్రంతో ఈ ట్యాగ్ లైన్ అందుకున్న ఆయన రీసెంట్ గా జాతీయ అవార్డుకు ఎంపికై చరిత్ర సృష్టించారు. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆయన గురించే చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా బన్నీ రెమ్యునరేషన్ గురించి సెన్సేషన్ వార్త ఒకటి బయటకు వచ్చి హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో ప్రభాస్, ఎన్టీఆర్, మహేశ్ బాబు లాంటి ఇతర స్టార్ హీరోలు కన్నా ఎక్కువ మొత్తంలో తీసుకోబోతున్నారని తెలిసింది.

వివరాళ్లోకి వెళ్తే.. ఏ ఒక్క రాయి పర్వతాన్ని చేయలేదు.. విజయం కూడా అలాంటిదే.. అల్లు అర్జున్ సినీ కెరీర్ కు అద్దం పట్టే మాట ఇది. మొదటి సినిమా గంగోత్రి రిలీజైనప్పుడు..ఆయన లుక్స్, యాక్టింగ్ పై ఎన్నెన్నో అభిప్రాయాలు, విమర్శలు వచ్చాయి. కానీ ఆయన అక్కడితో ఆగిపోలేదు. సినిమాకు సినిమాకు తన నటనలో వైవిధ్యం చూపిస్తూ, నటనలో తనని తాను తీర్చిదిద్దుకుంటూ.. కెరీర్ లో ముందుకెళ్లారు.

ఈ క్రమంలోనే సౌత్ లోనే క్రేజీయస్ట్ హీరోగా, స్టైలిష్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. అలా సినిమాల్లోనూ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్పలో పుష్పరాజ్‌గా అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ చిత్రంలో తన యాక్టింగ్​, డైలాగ్‌ డెలివరీ, డ్యాన్స్‌.. ఇలా అన్నీంటిలోనూ దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను తన మాస్‌ అవతార్​తో మెప్పించేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసులు వర్షం కురిపించింది.

అలా బన్నీ బాలీవుడ్ హీరోలను సైతం బీట్ చేస్తూ తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగారు. ఆయనతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా భారీ ఆఫర్స్ ను ప్రకటించారు. కానీ ఆయన మాత్రం ఇంకా దేనికి ఒకే చెప్పకుండానే.. పుష్ప 2 కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిమానులు ఊహించిన దాన్ని కన్నా వెయ్యి రెట్టు ఎక్కువగా ఇవ్వాలని శ్రమిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా కోసమే ఆయన తీసుకోబోయే రెమ్యునరేషన్ వివరాలు బయటకు వచ్చాయి. పుష్ప సినిమా సౌత్ కన్నా నార్త్ లోనే ఎక్కువగా వసూళ్లను అందుకున్న విషయం తెలిసిందే. పుష్ప 2 కోసం నార్త్ ఆడియెన్సే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమాకు ఇప్పుడు అక్కడ ఉన్న క్రేజ్‌ ప్రకారం దాదాపు రూ. 125కోట్లకు అమ్ముడుపోతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడా రైట్స్ బన్నీ తీసుకున్నట్లు తెలిసింది. పారితోషికానికి బదులు హిందీ రైట్స్ తీసుకున్నారట. అంటే ఈ లెక్కన.. తెలుగులో రూ. 125కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న స్టార్‌.. అల్లు అర్జునే అవ్వడం విశేషం. ఇక దీన్ని అమ్ముకుంటే లాభాలే లాభాలు.

తెలుగులో ఇప్పుటి వరకు ప్రభాసే రూ. 100కోట్లు ఎక్కువ తీసుకున్నారని ప్రచారం సాగింది. ఆ తర్వాత మహేశ్, పవన్ రూ.70 తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కానీ ఇప్పుడు బన్నీ ఏకంగా రూ.125కోట్లు అని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ ప్రచారం అవుతున్న ఈ వార్తతో సినీ ప్రియులు, బన్నీ అభిమానులు షాక్ అవుతున్నారు.

Tags:    

Similar News