.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

కల్కి 2 అమితాబ్ డబుల్ ఎనర్జీ..!

ఆయన చేసిన అశ్వద్ధామ రోల్ ఇంకా ఆ యాక్షన్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ లో అనిపించాయి.

Update: 2024-06-30 05:56 GMT

ప్రభాస్ కల్కి సినిమా ప్రభాస్ కెరీర్ లో మరో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని చెప్పొచ్చు. నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ఈ కొత్త ప్రపంచాన్ని చూసి ప్రేక్షకులంతా వావ్ అనేస్తున్నారు. ఐతే కల్కి సినిమా సినిమాలో ప్రభాస్ కి ఈక్వల్ రోల్ చేశారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. సినిమా లో ప్రభాస్ తర్వాత హైలెట్ గా చెప్పుకునే అంశాల్లో అమితాబ్ రోల్ ఒకటి. ఆయన చేసిన అశ్వద్ధామ రోల్ ఇంకా ఆ యాక్షన్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ లో అనిపించాయి.

బిగ్ బీ నుంచి ఆఫ్టర్ లాంగ్ టైం ఇంత భారీ స్కోప్ ఉన్న యాక్షన్ సీన్స్ వచ్చాయని చెప్పొచ్చు. అమితాబ్ కి కూడా ఈ సినిమా డబుల్ ఎనర్జీ ఇచ్చింది. సినిమా కోసం రిలీజ్ ముందు ఎందుకు అమితాబ్ అంత యాక్టివ్ గా ప్రమోషన్స్ లో పాల్గొన్నారో సినిమా చూసిన తర్వాత అర్థమైంది. తను చేసిన ఆ రోల్ సినిమాకే కాదు ఆయన కెరీర్ కి కూడా బూస్టింగ్ ఇచ్చింది. కల్కి అమితాబ్ రోల్ లో ఆయన కాకుండా మరెవరైనా చేయగలరా అంటే ఆన్సర్ దొరకడం కష్టం.

ఈ ఏజ్ లో కూడా సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా చేసేందుకు రెడీగా ఉంటారు అమితాబ్. అందుకే సినిమాకు ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్ గురించి అందరు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. కల్కి సినిమా తర్వాత అమితాబ్ మళ్లీ లీగ్ లోకి వచ్చే అవకాశం ఉంది. తన కోసం కొత్త పాత్రలు రాస్తే కచ్చితంగా వాటికి నూటికి నూరు పాళ్లు న్యాయం చేస్తానని చెప్పకనే చెప్పారు అమితాబ్.

Read more!

కల్కి చూసిన వారంతా కూడా బిగ్ బీ అమితాబ్ ని పొగడకుండా ఉండలేరు. సినిమా మీద ఆయనకున్న ప్యాషన్ ఏంటన్నది మరోసారి ఈ సినిమా చూస్తే అర్ధమవుతుంది. ఈమధ్య కేవలం ఒక టైపు పాత్రలకే అమితాబ్ పరిమితం కాగా ఆయనలోని ఎనర్జీని మళ్లీ రియాక్టివేట్ చేస్తూ అశ్వద్ధామ రోల్ అదరగొట్టారు. ఏది ఏమైనా కల్కి సినిమా బిగ్ బీ అమితాబ్ ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందించిందని చెప్పొచ్చు. నార్త్ సైడ్ ఈ సినిమా ఈ రేంజ్ సక్సెస్ కి అమితాబ్ మరో రీజన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News