పెళ్లిలో అన్ని డౌట్లు క్లియ‌ర్ చేసిన అంబానీ బ్ర‌ద‌ర్స్

ఇంత‌కుముందు క్రూయిజ్ షిప్ పార్టీకి ఈ జంట అటెండ్ కాక‌పోవ‌డంతో అన్న‌ద‌మ్ముల న‌డుమ ఏదో గొడ‌వ ముదిరింద‌ని ప్ర‌చార‌మైంది.

Update: 2024-07-10 16:45 GMT

ఓవైపు ముఖేష్ అంబానీ రెండో కొడుకు అనంత్ అంబానీ పెళ్లి త‌న స్నేహితురాలు రాధికా మ‌ర్చంట్ తో ఘ‌నంగా జ‌రుగుతోంది. ఈ పెళ్లికి ప‌లు రంగాల నుంచి ప్ర‌ముఖులంతా అటెండ‌వుతున్నారు. బాలీవుడ్ సినీప్ర‌ముఖులంతా అంబానీ పెళ్లిలోనే సంద‌డిగా క‌నిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ పెళ్లికి అనీల్ అంబానీ- టీనా అంబానీ విచ్చేస్తారా? అంటూ సందేహం వ్య‌క్త‌మైంది. ఇంత‌కుముందు క్రూయిజ్ షిప్ పార్టీకి ఈ జంట అటెండ్ కాక‌పోవ‌డంతో అన్న‌ద‌మ్ముల న‌డుమ ఏదో గొడ‌వ ముదిరింద‌ని ప్ర‌చార‌మైంది.

కానీ అనంత్ కి బాబాయ్ అయిన‌ అనిల్ అంబానీ త‌న‌ సతీమణి, మాజీ నటి టీనా అంబానీతో కలసి పెళ్లికి హాజరయ్యారు. ఈ జంట ఒళ్లంతా పసుపు పేస్ట్ పూసి, బంతి పువ్వుల‌ రేకులతో తడిసిపోయింది. ఈ జంట‌ చిరునవ్వుతో స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ల‌కు పోజులిచ్చారు. మొత్తానికి అన్న‌ద‌మ్ముల న‌డుమ అంతా స‌వ్యంగానే ఉంద‌ని దీంతో క్లారిటీ వ‌చ్చేసింది.

వివాహ వేడుకల్లో భాగంగా, ముఖేష్ అంబానీ -నీతా అంబానీ ఇటీవల జూలై 2న పాల్ఘర్‌లోని స్వామి వివేకానంద విద్యామందిర్‌లో నిరుపేదలకు సామూహిక వివాహాన్ని నిర్వహించారు. జూలై 3న అంబానీలు అద్భుతమైన మామెరు వేడుకను నిర్వహించారు. ఇది గుజరాతీ వివాహ సంప్రదాయం. సాంప్రదాయ హిందూ వైదిక ఆచారాలకు కట్టుబడి అనంత్ అంబానీ-రాధిక జంట‌ వివాహ వేడుకలు జ‌రుగుతాయి. ప్రధాన వేడుకలు శుక్రవారం, అంటే జూలై 12న‌ శుభ వివాహం లేదా వివాహ ఫంక్షన్‌తో ప్రారంభమవుతాయి. జూలై 13 (శనివారం) శుభ్ ఆశీర్వాద్‌తో వేడుకలు కొనసాగుతాయి. చివ‌రిగా మంగళ్ ఉత్సవ్ లేదా వివాహ రిసెప్షన్ జూలై 14న జ‌ర‌గ‌నుంది. జూలై 5న అంబానీ కుటుంబం సంగీత్ వేడుకను కూడా నిర్వహించింది. ఇందులో ప్రముఖులంతా పాల్గొన్నారు. గ్లోబల్ పాప్ సంచలనం జస్టిన్ బీబర్ కూడా సంగీత్ వేడుకలో ప్రదర్శన ఇచ్చాడు.

Tags:    

Similar News