యానిమల్ టోటల్ బడ్జెట్ ఎంతంటే?

ఈ సినిమాకి ఏకంగా 200 కోట్లు ఖర్చు పెట్టారంట. నిర్మాతలలో ఒకరైనా సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి ఈ విషయాన్ని ఇంటర్వ్యూలలో వెల్లడించాడు.

Update: 2023-11-29 04:26 GMT

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం యానిమల్. డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఐదు భాషలలో రిలీజ్ అవుతోంది. ఇదిలా ఉంటే భారీ బడ్జెట్ తో టి-సిరీస్, భ్రమరాంబిక పిక్చర్స్ సంయుక్తంగా యానిమల్ సినిమాని నిర్మించాయి. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కూడా టి-సిరీస్ చేయడం విశేషం.

ఆ సినిమా భూషణ్ కుమార్ కి భారీ లాభాలు తీసుకొచ్చింది. దీంతో మరో మూడు సినిమాలు సందీప్ రెడ్డి దర్శకత్వంలో చేయడానికి భూషణ్ కుమార్ ఒప్పందం చేసుకున్నారు. వాటిలో భాగంగానే యానిమల్ ఇప్పుడు వస్తోంది. ఈ సినిమాకి ఏకంగా 200 కోట్లు ఖర్చు పెట్టారంట. నిర్మాతలలో ఒకరైనా సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి ఈ విషయాన్ని ఇంటర్వ్యూలలో వెల్లడించాడు.

సందీప్ రెడ్డిపై నమ్మకంతో ఇంత బడ్జెట్ పెట్టి సినిమా చేసినందుకు భూషణ్ కుమార్ కి ప్రణయ్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ద్వారా సగానికి పైగా పెట్టుబడి రికవరీ అయిపోయిందంట. థీయాట్రికల్ బిజినెస్ కూడా స్ట్రాంగ్ గా జరగడంతో భూషణ్ కుమార్ టేబుల్ ప్రాఫిట్ తోనే యానిమల్ రిలీజ్ చేస్తున్నారు.

ట్రైలర్ తర్వాత మూవీపైన ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఓవర్సీస్ తో పాటు నార్త్ ఇండియాలో మల్టీప్లెక్స్ చైన్ లో అడ్వాన్స్ బుకింగ్స్ భారీ గా జరుగుతున్నాయి. ఇదే జోరు కొనసాగితే మొదటి రోజు వంద కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అదే జరిగితే రణబీర్ కపూర్ ఏకంగా ప్రభాస్, షారుఖ్ సరసన చేరుతాడు.

తెలుగులో కూడా ఈ సినిమాకి సాలిడ్ ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ పీక్ లో ఉన్నాయి. మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన నటించడం కూడా అదనపు ఆకర్షణగా ఉంది. మరి ఇన్ని ఎక్స్ పెక్టేషన్స్ మధ్య వస్తోన్న యానిమల్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News