నాగార్జున హీరోయిన్ ఏంటి అదోలా!

తెలుగులో రెండు సినిమాలు, త‌మిళంలో ఒక సినిమా చేసిన ఈ బ్యూటీ అటుపై ఎవ‌రికీ క‌నిపించ‌కుండా వెళ్లిపోవ‌డంతో అభిమానులు చాలా ఆవేద‌న చెందారు.

Update: 2024-03-22 02:45 GMT

కొన్నేళ్ల క్రితం అర్థాంత‌రంగా సినిమాల‌ను వ‌దిలేసి, పెళ్లి సంసారం అంటూ రంగుల ప్ర‌పంచానికి దూర‌మైంది. తెలుగులో రెండు సినిమాలు, త‌మిళంలో ఒక సినిమా చేసిన ఈ బ్యూటీ అటుపై ఎవ‌రికీ క‌నిపించ‌కుండా వెళ్లిపోవ‌డంతో అభిమానులు చాలా ఆవేద‌న చెందారు. త‌న గురించి చాలా కాలం పాటు ఆరాలు తీసారు.


క‌ట్ చేస్తే...కుటుంబంతో కలిసి లండన్‌లో నివసిస్తోందని క‌థ‌నాలొచ్చాయి. 2003లో లండన్‌కు చెందిన సచిన్ సాగర్‌ను ఈ ట్యాలెంటెడ్ బ్యూటీ వివాహం చేసుకుంది. వివాహానంత‌రం ఆమె నటనపై పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు వాల‌కం మారింది. న‌ట‌న‌లోకి తిరిగి కంబ్యాక్ అయ్యేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. అదే క్ర‌మంలో వ‌రుస ఫోటోషూట్ల‌తో అంత‌ర్జాలంలో గుబులు రేపుతోంది. ఇప్ప‌టికే మ‌మ్మీగా ప్ర‌మోట్ అయిన ఈ బ్యూటీ ఎవ‌రు? అంటే.. క‌చ్ఛితంగా అది మ‌న్మ‌ధుడు ఫేం అన్షు గురించే. న‌టించిన రెండు మూడు చిత్రాల‌తోనే బోలెడంత పాపుల‌రైంది ఈ బ్యూటీ. త‌న‌దైన అందం, న‌ట‌ప్ర‌తిభ‌తో ఆక‌ట్టుకుని యువ‌త‌రం హృద‌యాల్లో నిలిచింది. గ‌త కొంత‌కాలంగా రంగుల ప్ర‌పంచానికి దూర‌మైంది. చాలా గ్యాప్ అనంత‌రం ఈ ఏడాది తిరిగి నటించాలనే ఆసక్తిని బహిరంగంగా చెప్పింది.


అన్షు అంబానీ మళ్లీ నటించాలనే కోరికను వ్యక్తం చేసింది. ఇటీవలి ఇంటర్వ్యూలో త‌న‌కంటూ ఒక సొంత‌ ఫ్యాషన్ లేబుల్‌ను కలిగి ఉండటంతో పాటు, అభిజ్ఞా ప్రవర్తన చికిత్సకురాలి(కాగ్నిటివ్ బిహేవియ‌ర్ థెర‌పిస్ట్‌)గా ప్రాక్టీస్ చేస్తున్నానని అన్షూ చెప్పింది. ఈ బ్యూటీ తిరిగి సినిమాల్లోకి రావడం అంటే అక్క చెల్లి పాత్ర‌లు పోషిస్తుందని అర్థం. త్రివిక్రమ్- పూరి లాంటి దర్శకులు ఆమె మాట వింటారనేది ఒక గుస‌గుస‌.


16 ఏళ్ల వయసులో నాగార్జున సరసన క‌థానాయిక‌గా రంగప్రవేశం చేసిన అన్షు ప్రభాస్ సరసన `రాఘవేంద్ర`తో పాటు తమిళ చిత్రం `జై`లో ప్రధాన పాత్ర పోషించింది. తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ సాధించినా పెళ్లి తర్వాత సినిమాల‌లో న‌టించ‌లేదు. ప్ర‌స్తుతం బికినీల్లో, లింగ‌రీల్లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్న ట్రెడిష‌న‌ల్ బ్యూటీ అన్షును చూస్తుంటే అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇదంతా రీఎంట్రీ కోసం త‌హ‌త‌హ అంటూ గెస్ చేస్తున్నారు.

Tags:    

Similar News