అనుప‌మ సో క్యూల్ ల‌వ్‌లీ శారీ లుక్

అందానికి అందం.. హాట్ లుక్.. క్యూట్ నెస్ ల మిశ్ర‌మం అనుప‌మ అంటూ యువ‌త‌రం వోన్ చేసుకున్నారు.

Update: 2023-11-15 03:00 GMT

న‌డుము అందాన్ని ఇంత స్పెష‌ల్ గా ఎలివేట్ చేయ‌డం కొంద‌రికే తెలిసిన విద్య‌. ఇలాంటి విద్య‌లో ఆరి తేరిపోయింది క్యూట్ బ్యూటీ అనుప‌మ‌. ఈ ట్యాలెంటెడ్ బ్యూటీ తెలుగు `ప్రేమ‌మ్`తో హిట్ అందుకున్న త‌ర్వాత ఇక్క‌డే స్థిర‌ప‌డిపోయింది. చాలా మంది మాలీవుడ్ భామ‌ల్లానే అనుప‌మ కూడా టాలీవుడ్ లో పెద్ద స్థాయి కెరీర్ ని కోరుకుంది. అందుకు త‌గ్గ‌ట్టే తెలుగు ప‌రిశ్రమ వ‌రుస‌గా అవ‌కాశాలిచ్చి ఆద‌రిస్తోంది. అందానికి అందం.. హాట్ లుక్.. క్యూట్ నెస్ ల మిశ్ర‌మం అనుప‌మ అంటూ యువ‌త‌రం వోన్ చేసుకున్నారు.


ఇప్పుడు అనుప‌మ దీపావ‌ళి లుక్ అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. ఈ దీపావ‌ళికి అనుప‌మ ప‌చ్చ చీర‌లో సోయ‌గాల్ని అందంగా ప్ర‌ద‌ర్శించింది. ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో త‌న సొగ‌సును ప్ర‌ద‌ర్శించి షో స్టాప‌ర్ గా నిలిచింది. ప్ర‌స్తుతం ఈ రేర్ క్లిక్స్ అంత‌ర్జాలంలో సునామీలా వైర‌ల్ అయిపోతున్నాయి. అనుప‌మ సో క్యూట్ ల‌వ్ లీ శారీ లుక్ కి యూత్ ఫిదా అయిపోతోంది. ఇక ఈ క్యూటీ నడుము సొగసు చూడ‌త‌ర‌మా? అంటూ బోయ్స్ ల‌వ్ హార్ట్ ఈమోజీల్ని షేర్ చేస్తున్నారు.


ప్ర‌స్తుతం అనుప‌మ మాలీవుడ్ లో సురేష్ గోపి తో క‌లిసి `జానకి v/s స్టేట్ ఆఫ్ కేరళ (JSK)` అనే లీగల్ థ్రిల్లర్‌లో నటిస్తోంది. ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ వార్తను ద‌ర్శ‌కుడు ప్రవీణ్ ఫేస్‌బుక్‌లో ప్రచురించారు. సినిమా సెట్‌లో చివరి రోజు నుండి ఫోటోలను షేర్ చేసారు. అతడు ఈ పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చాడు. ``సంవత్సర కాలంగా కష్టపడి, రక్తం, చెమట, నొప్పి, గాయాలు వంటి చాలా అనుభవాల తర్వాత, జానకి v/s స్టేట్ ఆఫ్ కేరళకు చెందిన మొత్తం టీమ్ నుండి.. ప్యాక్ అప్ డే`` అని వ్యాఖ్య‌ను జోడించాడు.


సురేశ్ గోపీ ఈ చిత్రంలో లాయర్‌గా నటిస్తున్నారు. మణియరయిలే అశోక్ లో న‌టించిన తర్వాత అనుపమ మలయాళ ప‌రిశ్ర‌మ‌లోకి ఈ సినిమాతోనే తిరిగి ప్ర‌వేశిస్తోంది. JSKలో సురేష్ గోపి చిన్న కొడుకు మాధవ్ సురేష్ ఒక ముఖ్య పాత్ర‌లో న‌టిస్తున్నాడు. శృతి రామచంద్రన్, దివ్య పిళ్లై, అస్కర్ అలీ, బైజు సంతోష్, కొట్టాయం రమేష్ మరియు షోబీ తిల్కన్ త‌దిత‌రులు నటించారు. కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. తెలుగులో డిజి టిల్లు 2 (టిల్లు స్క్వేర్)లోను న‌టిస్తోంది. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు.

Tags:    

Similar News