డిస్కషన్ అంతా అనుపమ బ్లౌజ్ గురించే!
అనుపమ పరమేశ్వరన్.. అతి తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది ఈ మలయాళ కుట్టి
అనుపమ పరమేశ్వరన్.. అతి తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది ఈ మలయాళ కుట్టి. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషల్లో మంచి ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది. వరుసగా చిత్రాలు చేస్తూ సినీ ప్రియులను అలరిస్తోంది. ఇటీవల స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డతో కలిసి టిల్లు స్క్వేర్ తో వచ్చి సూపర్ హిట్ కొట్టేసింది. ఆ మూవీలో లిల్లీ పాత్రలో కనిపించి తన కెమిస్ట్రీ, యాక్టింగ్ తో ఆకట్టుకుంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో అనుపమ పరమేశ్వరన్ పై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. బోల్డ్ రోల్ ఎందుకు చేసిందన్న ప్రశ్నలతో తెగ ట్రోల్ చేశారు నెటిజన్లు. చివరకు బాగా ఫీలై ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరుకాలేదు. ఇక మూవీ రిలీజ్ అయ్యాక.. ఆమె యాక్టింగ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. సినిమాలో మొదట్లో రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువే ఉన్నప్పటికీ.. క్రమంగా తనలోని షేడ్స్ తో అలరించింది అనుపమ.
ఇప్పటికే చేతి నిండా ప్రాజెక్టులతో ఉన్న అనుపమకు ఈ సినిమా మరింత ఊపునిచ్చింది. ఇకపై క్యారెక్టర్ డిమాండ్ చేస్తే గ్లామర్ షో చేయడానికి సిద్ధం అన్నట్లు హింట్ ఇచ్చింది. కొన్ని నెలలుగా సరైన హిట్ లేని అమ్మడులో ఈ మూవీ మంచి జోష్ నింపింది. ప్రస్తుతం ప్రవీణ్ కండ్రేగులతో కలిసి పరదా చిత్రానికి గాను వర్క్ చేస్తోంది. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో నటిస్తోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ దూసుకుపోతోంది.
ఓ వైపు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో కూడా తన అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటోంది. మోడ్రన్ తో పాటు ట్రెడిషనల్ ఔట్ ఫిట్స్ లో గ్లామర్ షో చేస్తుంటోంది. రకరకాల చీరల్లో అందాలు ఆరబోస్తుంటోంది. ఇటీవల టిల్లు స్క్వేర్ ప్రెస్ మీట్ లో కిటికీల జాకెట్ ఉన్న చీరలో మెరిసి.. ఆ రోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది అనుపమ. ఇప్పుడు మరో ట్రెండీ శారీలో దిగిన పిక్స్ షేర్ చేసింది.
నెట్టెడ్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ తో అదిరిపోయే పోజులు ఇచ్చింది అనుపమ. కొంటెగా చూస్తూ ఆకట్టుకుంటోంది. క్రేజీ శారీలో వయ్యారాలు ఒలకబోసింది. ప్రస్తుతం అనుపమ పిక్స్ కు కుర్రాళ్లంతా ఫ్రీజ్ అయిపోతున్నారు. బ్లౌజ్ అదిరిపోయిందని అమ్మాయిలు కూడా కామెంట్లు పెడుతున్నారు. నెటిజన్లంతా అనుపమ.. బ్లౌజ్ కోసమే మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి అనుపమ ట్రెండ్ బాగా ఫాలో అవుతుందిగా!!