మహేష్ ఫ్లాప్ నిర్మాతలకు జాక్ పాట్

Update: 2016-01-23 17:30 GMT
మహేష్ బాబుతో దూకుడు సూపర్ హిట్ తర్వాత.. 14 రీల్స్ సంస్థకు అంతా బ్యాడ్ టైం నడిచింది. వరుసగా సూపర్ స్టార్ తో సినిమాలు చేసేసి.. 14 రీల్స్ టాప్ రేంజ్ కి వెళ్లిపోతోందని భావిస్తున్న సమయంలో.. వన్ నేనొక్కడినే - ఆగడు రూపంలో రెండు డిజాస్టర్స్ ఈ సంస్థను పలకరించాయి. అతి తక్కువ సమయంలో రెండు పెద్ద దెబ్బలు తగలడంతో.. చిన్న  సినిమాలు తీయాలని నిర్ణయించుకుని.. నానితో ప్రాజెక్ట్ ఓకే చేసుకున్నారు ఈ నిర్మాతలు.

అఫ్ కోర్స్.. అప్పటికి నాని కూడా ఫ్లాప్ ల మధ్యలోనే ఉన్నాడు. ఆ తర్వాత వచ్చిన భలేభలే మగాడివోయ్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో.. ఇప్పుడు 14 రీల్స్ కి పట్టిందల్లా బంగారం అవుతోంది. వచ్చే నెలలో రాబోతోన్న కృష్ణ గాడి వీర ప్రేమగాధపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అందాలరాక్షసి తీసిన హను రాఘవపూడి డైరెక్షన్ కావడం, ట్రైలర్స్ డిఫరెంట్ గా ప్రామిసింగ్ ఉండడంతో.. భారీ మొత్తానికి కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ముందుకొచ్చారు. మంచి పోటీలో చివరకు ఫ్యాన్సీ రేట్ ఇచ్చి అభిషేక్ ఫిలింస్.. కృష్ణగాడి వీర ప్రేమ గాధకు చెందిన ఏపీ - తెలంగాణ రైట్స్ ను కొనుగోలు చేసింది. ఇందుకోసం 11 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.

నాని సినిమాకు ఇప్పటివరకూ ఇదే హైయెస్ట్ రేట్. మరోవైపు కర్నాటక - ఓవర్సీస్ రైట్స్ ఇంకా 14 రీల్స్ దగ్గరే ఉన్నాయి. ఈ ఏరియాల్లో సొంతగానే రిలీజ్ చేసుకోనున్నట్లు సమాచారం. ఇది కాక శాటిలైట్ రూపంలో కూడా పెద్ద మొత్తమే వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి నాని రూపంలో 14 రీల్స్ సంస్థకు జాక్ పాట్ తగిలింది. రెండు ఫ్లాప్స్ తర్వాత తీసుకున్న నిర్ణయం.. ఇప్పుడు కాసులు కాదు కోట్లు కురిపిస్తోంది.

Tags:    

Similar News