మ‌హేష్‌ కి 30 రోజుల‌కు 30 కోట్లా?

Update: 2020-02-29 04:18 GMT
మెగాస్టార్ చిరంజీవీ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 152వ సినిమా షూటింగ్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర వేగంగా తెర‌కెక్క‌తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కీల‌కమైన 40 నిమిషాల‌ పాత్ర కోసం రామ్ చ‌ర‌ణ్ ని ఎంపిక చేశార‌ని ప్ర‌చార‌మైనా.. ఆర్.ఆర్.ఆర్ షెడ్యూల్ కి స‌మ‌స్యాత్మ‌కం కాకూడ‌ద‌ని ఆ నిర్ణ‌యం మార్చుకున్నార‌ని ప్ర‌చార‌మైంది. దీంతో ఆ స్థానాన్ని సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో గానీ..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో గానీ భ‌ర్తీ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగింది. చివ‌రిగా మెగా ఫ్యామిలీ హీరో కాకుండా.. బ‌య‌ట స్టార్ అయితేనే బెట‌ర్ అని చిరు-కొర‌టాల బృందం భావించార‌ట‌. ఆ క్ర‌మంలోనే సూప‌ర్ స్టార్ మ‌హేష్ వైపు మెగ్గు చూపిన‌ట్లు తెలుస్తోంది. ఫైన‌ల్ గా మ‌హేష్ నే ఒప్పించార‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి.

మెగాస్టార్ చిరంజీవితో మైత్రి కార‌ణంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఈ ఆఫ‌ర్ ని రిజెక్ట్ చేసే ఛాన్స్ లేదు. ఈ నేప‌థ్యంలో దాదాపు మ‌హేష్ ఖాయ‌మైన‌ట్టేన‌ని ప్ర‌చార‌ముతోంది. అయితే ఆ పాత్ర స్వ‌రూపం ఏలా ఉంటుంది? అన్న వివ‌రం ఇంకా ఎక్క‌డా లీక‌వ్వ‌లేదు. న‌క్స‌లైట్ పాత్ర అని లీకు అందినా.. మెగాస్టార్ కామ్రేడ్ గెట‌ప్ కి సంబంధించిన‌ లుక్ ఒక‌టి బ‌య‌ట‌కు రావ‌డంతో డైల‌మాలో ప‌డాల్సి వ‌చ్చింది. మ‌రి మహేష్ రోల్ ఎలా ఉంటుంది? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్ గానే ఉంది.

మ‌రి ఈ సినిమా కు మ‌హేష్ ఎంత పారితోషికం తీసుకుంటారు? అన్న‌ది స‌స్పెన్స్. ఇందులో దాదాపు 30 నుంచి 40 నిమిషాల పాటు ఆ పాత్ర తెర‌పై క‌నిపిస్తుంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో 30 రోజుల పాటు మ‌హేష్ పై చిత్రీక‌రించాల్సి వ‌స్తోందిట‌. దీనిలో భాగంగా ఒక్కొక్క‌ రోజుకు కోటి చొప్పున 30 రోజుల‌కు 30 కోట్ల వ‌ర‌కూ సూప‌ర్ స్టార్ ఛార్జ్ చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. మ‌హేష్ మార్కెట్ ప్ర‌కార‌మే ఇంత ఛార్జ్ చేస్తున్నారుట‌. అయితే సాధార‌ణంగా మ‌హేష్ సినిమాలో ఎలాంటి లాభాలు తీసుకోకుండా న‌టిస్తే ఎంత ఛార్జ్ చేస్తారు? అన్న దానిపై స‌రైన క్లారిటీ లేదు. గ‌త కొన్నేళ్ల‌గా త‌న పారితోషికాన్నే పెట్టుబ‌డి గా పెడుతూ జీఎంబీ సంస్థ పేరుతో భాగ‌స్వామ్య నిర్మాత నుంచి లాభాల్లో వాటా తీసుకుంటున్నారన్న ప్ర‌చారం ఉంది.
Tags:    

Similar News