కంటెంట్ పరంగా అయినా.. వసూళ్ల విషయంలో అయినా తనకు తానే సాటి అని అమీర్ ఖాన్ మరోసారి రుజువు చేశాడు. ‘దంగల్’ సినిమాకు ఎటు చూసినా ప్రశంసల వర్షం కురుస్తోంది. దీంతో పాటు వసూళ్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. డీమానిటైజేషన్ ప్రభావాన్ని తట్టుకుని కూడా తొలి వీకెండ్లో దేశీయంగానే వంద కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. వీకెండ్ తర్వాత కూడా అనూహ్యమైన వసూళ్లతో దూసుకెళ్తోంది. సోమవారం కూడా ఈ సినిమా రూ.25.7 కోట్లు కొల్లగొట్టి ఔరా అనిపించింది. మంగళవారం రూ.23.09 కోట్లు.. బుధవారం రూ.21.2 కోట్లు వసూలు చేయడం కూడా అనూహ్యమే.
మొత్తంగా ఇప్పటిదాకా ‘దంగల్’ ఇండియా వరకే రూ.177 కోట్ల దాకా కొల్లగొట్టి అబ్బుర పరిచింది ‘దంగల్’. మరోవైపు ఈ చిత్రం ఓవర్సీస్ లోనూ జైత్రయాత్ర సాగిస్తోంది. ఇప్పటికే ‘దంగల్’ ఓవర్సీస్ వసూళ్లు రూ.100 కోట్ల మార్కును దాటేశాయి. మళ్లీ వీకెండ్ వస్తుండటం.. చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ‘దంగల్’ జోరు మరింత పెరిగే అవకాశముంది. రెండో వీకెండ్లోనూ ఫస్ట్ వీకెండ్ తరహాలో వసూళ్లు వచ్చే అవకాశముంది. ఈ ఊపు చూస్తుంటే ‘పీకే’ రికార్డులు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది. హిందీలో మాత్రమే కాక ప్రాంతీయ భాషల్లోనూ ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తుండటం విశేషం. మొత్తానికి ఇండియాలో తనను మించి హీరో లేదని.. తనకు తానే సాటి అని అమీర్ ఖాన్ మరోసారి రుజువు చేసుకున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/