రజినీతో రిస్క్ చేసేస్తున్నారా?

Update: 2016-05-12 10:19 GMT
సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కబాలి మూవీ సెన్సేషన్స్ ఇప్పటికే స్టార్ట్  అయిపోయాయి. టీజర్ మొదలైన సంచలనాలు రిలీజ్ తర్వాత కంటిన్యూ అవుతాయనే అంచనాలున్నాయి. ప్రస్తుతం కబాలి తెలుగు వెర్షన్ కి సంబంధించిన డీల్.. టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది.

తెలుగు కబాలికి  సంబంధించి ఏపీ - తెలంగాణల్లో డిస్ట్రిబ్యూషన్ హక్కులను అభిషేక్ పిక్చర్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం భారీ మొత్తాన్నే వెచ్చించారని తెలుస్తోంది. అధికారికంగా చెప్పకపోయినా.. 31 కోట్లకు రూపాయలకు డీల్ సెట్ అయిందనే టాక్ వినిపిస్తోంది. ఓ డబ్బింగ్ సినిమాకి ఇంత మొత్తం ఇవ్వడం అంటే రిస్క్ అంటున్నారు ట్రేడ్ జనాలు. రజినీకాంత్ మూవీ హిట్ అయితే, ఈ మొత్తం రాబట్టడం పెద్ద విషయం కాదు. కానీ ప్రస్తుతం సూపర్ స్టార్ ఫామ్ అంత గొప్పగా లేదు.

రజినీ నటించిన గత రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా పరాజయం పాలయ్యాయి. బయ్యర్లు - డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు మిగిల్చాయి. లింగ - కొచ్చాడయాన్ లు ఇచ్చిన షాక్ ల నుంచి చాలామంది కోలుకోలేదు కూడా. అలాంటి సమయంలో ఇంత భారీ మొత్తాన్ని చెల్లించి, తెలుగు రైట్స్ తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే.. ఆ రెండు ఫ్లాప్ ల కారణంగానే డీల్ ఈ రేటుకు తెగిందని, లేకపోతే 40వరకూ ఇవ్వాల్సి వచ్చేదనే టాక్ కూడా ఉంది.
Tags:    

Similar News