టాలీవుడ్ లో మరో మంచి హోల్ సేల్ బేరం

Update: 2016-02-08 01:30 GMT
సినిమాలో కంటెంట్ ఉన్నా సరైన బిజినెస్ జరగట్లేదా? బయ్యర్లలో ఆసక్తి పుట్టట్లేదా? అలాంటపుడు ఒకటే మార్గం. దిల్ రాజునో.. సాయి కొర్రపాటి నో.. సురేష్ బాబునో లేదా ఇంకో పెద్ద నిర్మాతనో పిలవండి. షో వేయండి. వాళ్లకు నచ్చి సొంతంగా రిలీజ్ చేయడానికి ముందుచ్చారా.. ప్రెస్ మీట్ పెట్టి ఓ ప్రకటన చేశారా? అంతే సంగతులు. దెబ్బకు సినిమా సేల్ అయిపోతుంది. కొన్ని చిన్న సినిమాల విషయంలో ఇది చాలా మంచి స్ట్రాటజీగా నిలుస్తోంది. గత ఏడాది పటాస్ - సినిమా చూపిస్త మావ లాంటి సినిమాల్ని దిల్ రాజు ఇలాగే సేవ్ చేశాడు. సాయి కొర్రపాటి రాజు గారి గది - జత కలిసే లాంటి సినిమాలకు ఇలాగే ప్రాణం పోశాడు. ఐతే ఆ సినిమాల్లో కంటెంట్ కూడా ఉంది కాబట్టే అవి ఆడాయన్నది వాస్తవం. కానీ ఆ పెద్ద నిర్మాతల హ్యాండ్ పడటం ఆ సినిమాలకు చాలా కలిసొచ్చిందన్నది మాత్రం కొట్టిపారేయలేని విషయం.

తాజాగా ‘కళ్యాణ వైభోగమే’ టీం కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అయినట్లు కనిపిస్తోంది. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న ఆ చిత్రం బృందం నైజాంలో దిల్ రాజు తర్వాత పెద్ద డిస్ట్రిబ్యూటర్‌ గా ఎదిగిన అభిషేక్ కు సినిమాను చూపించింది. ఆయనకు నచ్చి సినిమాను హోల్ సేల్ గా కొనేశారు. అభిషేక్ పిక్చర్స్ బేనర్ మీదే దీన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నారు. డైరెక్టర్ నందిని రికార్డు గత సినిమా ‘జబర్దస్త్’ మిగిల్చిన చేదు అనుభవంతో భయంతో ఉన్న బయ్యర్లు ‘కళ్యాణ వైభోగమే’ మీద అంతగా ఆసక్తి చూపించట్లేదు. బిజినెస్ కాకపోవడమే సినిమా వాయిదా పడుతుండటానికి కారణమవుతోంది. ఇక అభిషేక్ ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి రిలీజ్ సాఫీగా అయిపోతుంది. త్వరలోనే డేట్ అనౌన్స్ చేయబోతున్నారు.
Tags:    

Similar News