నిఖిల్ సినిమాపై పెద్ద హ్యాండ్ పడింది

Update: 2016-02-26 07:30 GMT
టాలీవుడ్లో ప్రస్తుతం రైజింగ్‌లో ఉన్న డిస్ట్రిబ్యూషన్ సంస్థల్లో అభిషేక్ పిక్చర్స్ ఒకటి. ఏడాది కిందట నెమ్మదిగా ప్రస్థానం మొదలుపెట్టి.. ఇప్పుడు దిల్ రాజు లాంటి టాప్ డిస్ట్రిబ్యూటర్‌ కే సవాలు విసురుతూ దూసుకెళ్తున్నాడు అభిషేక్. మొన్న పండక్కి విడుదలైన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా మీద ఏకంగా రూ.14 కోట్ల పెట్టుబడి పెట్టాడు అభిషేక్. నాని సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ కూడా అతనే తీసుకున్నాడు. ఇంకా కళ్యాణ వైభోగమే - సుప్రీమ్ లాంటి సినిమాల్ని కూడా ఇలాగే గుత్తగా కొనేశాడు. లేటెస్టుగా మరో ఆసక్తికర సినిమా మీద అభిషేక్ హ్యాండ్ పడింది.

యువ కథానాయకుడు నిఖిల్ హీరోగా ‘టైగర్’ ఫేమ్ వీఐ ఆనంద్ ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అభిషేక్ పిక్చర్సే రిలీజ్ చేయబోతోంది. ఇంకా సగం షూటింగ్ మిగిలే ఉండగానే ఈ సినిమా హక్కులు తీసేసుకున్నాడంటే.. ఈ ప్రాజెక్టు మీద అభిషేక్ కు ఎంత భరోసా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదో డిఫరెంట్ జానర్లో తెరకెక్కుతున్న ప్రయోగాత్మక సినిమా. మేఘన పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్ - అవికా గోర్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులు కామనే అని.. ఐతే కొన్ని సినిమాల్లో పని చేసిన సంతృప్తి మాత్రం ఎప్పటికీ ఉంటుందని.. తాను ప్రస్తుతం చేస్తున్న సినిమా అలాంటిదేనని.. ఈ మూవీ గురించి గొప్పగా చెబుతున్నాడు నిఖిల్. ‘శంకరాభరణం’తో గట్టి ఎదురు దెబ్బ తిన్న నిఖిల్ ఈ సినిమాపై చాలా ఆశలతోనే ఉన్నాడు. ఐతే శకునాలు చూస్తుంటే నిఖిల్ ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ ఎక్కేలాగే కనిపిస్తున్నాడు.
Tags:    

Similar News