వావ్ చీర కట్టులో నీ అంత అందంగా మరెవ్వరు ఉండరేమో..!

Update: 2022-10-31 02:30 GMT
హీరోయిన్స్ ను మోడ్రన్ డ్రస్ ల్లో స్కిన్‌ షో డ్రస్ ల్లోనే చూడాలని అభిమానులు ప్రేక్షకులు కోరుకుంటూ ఉంటారు. స్కిన్‌ షో చేసే వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. అంతెందుకు స్కిన్‌ షో ఎక్కువగా చేసే హీరోయిన్స్ యొక్క ఇన్ స్టా గ్రామ్‌ పేజ్‌ కే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు.

అయితే కొద్ది మంది హీరోయిన్స్ చీర కట్టు లో కూడా చూపు తిప్పుకొనివ్వకుండా అందంగా ఉంటారు అంటూ ఇలాంటి ఫోటోలను చూసిన సందర్భంలో అనిపిస్తూ ఉంది. కీర్తి సురేష్ కెరీర్ ఆరంభం నుండే స్కిన్‌ షో కి దూరంగా ఉంటూ వచ్చింది.

స్కిన్‌ షో చేయని హీరోయిన్స్ కు పెద్దగా ఆఫర్స్‌ దక్కిన సందర్భాలు ఇండస్ట్రీలో లేవు. ఈ మధ్య కాలంలో హీరోయిన్ అంటే మినిమం నడుము నాభి తొడలు చూపించాల్సిందే. కానీ కీర్తి సురేష్ మాత్రం వాటికి దూరంగా ఉంటూ ఇలా పద్దతైన చీర కట్టులోనే కనిపిస్తూ వచ్చింది.

చీర కట్టు లో కనీసం నడుము అందం కూడా చూపించకుండా ఇంత అందంగా కనిపించగల హీరోయిన్‌ కీర్తి సురేష్ తప్ప మరెవ్వరు ఉండరేమో అంటూ అభిమానులు మాట్లాడుకుంటూ ఉన్నారు. ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ ఎరుపు చీరలో మెరిసి పోతుంది అంటూ అభిమానులు తెగ లైక్ చేస్తున్నారు.

అందాలు ఆరబోయడం కంటే ఇలా చీర కట్టులో పద్దతైన అమ్మాయిగా నే కీర్తి సురేష్ ను చూడాలని తాము కోరుకుంటున్నాం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మహానటి సినిమా తర్వాత పాన్‌ ఇండియా రేంజ్‌ లో గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్ సర్కారు వారి పాట సినిమాలో కాస్త స్కిన్‌ షో చేసేందుకు ప్రయత్నించింది. ముందు ముందు మరింతగా స్కిన్‌ షో చేస్తుందా అనేది చూడాలి.
Tags:    

Similar News