యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు అనుకున్న సమయం కంటే కాస్త ఎక్కువ సమయాన్నే తీసుకుంటాయనే విషయం తెలిసిందే. కారణాలు ఏవైనప్పటికీ ప్రభాస్ గత చిత్రాలను పరిశీలిస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది. 'బాహుబలి' సినిమాల కోసం ఐదేళ్లు కేటాయించిన ప్రభాస్.. 'సాహో' సినిమా కోసం రెండేళ్ల డేట్స్ ఇచ్చేసాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న 'రాధే శ్యామ్' సినిమా కోసం కూడా బల్క్ డేట్స్ ఇచ్చాడు. అయితే ఈ ప్రాజెక్ట్స్ కి ఎక్కువ సమయం పట్టడానికి కారణం అవన్నీ భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాలు కావడమే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసాడు ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా.. ఓం రౌత్ డైరెక్షన్ లో 'ఆదిపురుష్' అనే ద్విభాషా చిత్రాన్ని లైన్లో పెట్టాడు. అయితే 'ఆదిపురుష్' చిత్రాన్ని 2021లో పట్టాలెక్కించి 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఇదెలా సాధ్యమని అందరూ అనుమానం వ్యక్తం చేశారు.
కాగా ప్రభాస్ ''రాధే శ్యామ్'' చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. కరోనా కారణంగా ఇప్పటికే ఐదు నెలల కాలం వృధాగా పోయింది. 'రాధే శ్యామ్' బ్యాలన్స్ షూటింగ్ కంప్లీట్ అయ్యాక ప్రభాస్ నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా ఎపుడు మొదలవుతుందో ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. అయినప్పటికీ 'ఆదిపురుష్' టీమ్ 2022లో రిలీజ్ చేస్తామని ప్రకటించడం ఏంటని అందరూ ఆలోచించారు. అయితే ఈ సినిమాని 90 రోజుల్లో కంప్లీట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. భారీ స్కేల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎక్కువ భాగం గ్రీన్ మ్యాట్ మీదే షూట్ చేయబోతున్నారట. 'తానాజీ' సినిమాని వీలైనంత తక్కువ సమయంలో కంప్లీట్ చేసిన ఓం రౌత్ 'ఆదిపురుష్' ని కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయగలనని కాన్ఫిడెంట్ గా ఉన్నారట. ఇక ప్రభాస్ కూడా కుదిరితే నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ని కూడా ప్యారలల్ గా షూట్ చేయొచ్చనే ఆలోచన చేస్తున్నాడట. అయితే ప్రభాస్ రెండు చిత్రాల్లో ఒకేసారి పాల్గొంటారా? లేదా ముందు ఒక ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడా? అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి.