యంగ్ హీరో అడవి శేషు వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 'గుఢచారి'..'ఎవరు'.. 'మేజర్' తో హ్యాట్రిక్ విజయాలు అందుకుని డబుల్ హ్యాట్రిక్ పై కన్నేసాడు. ఈ క్రమంలో ఇటీవలే 'హిట్-2' తో మరో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు. దీంతో తదుపరి రెండు సినిమాలతోనూ హిట్లు అందుకుని డబుల్ హ్యాట్రిక్ నమోదు చేయాలన్నది శేష్ ప్లాన్.
అందుకు తగ్గట్టే శేష్ ప్రీప్లాన్డ్ గా ముందుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా 'జీ-2' గుడఛారి'కి సీక్వెల్ ని ఏకంగా పాన్ ఇండియాలోనే తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. 'మేజర్' తో దక్కిన పాన్ ఇండియా క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకునేలా ఈ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ఏకంగా మూడు నిర్మాణ సంస్థలు రంగంలోకి దిగాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ- అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్- ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా 'గుఢచారి-2' నిర్మిస్తున్నాయి.
'మేజర్' చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. స్వయంగా అడివి శేష్ ఈ చిత్రానికి కథను అందించారు. సినిమాకి సంబంధించిన 'ప్రీ విజన్' వీడియోను జనవరి 9న ఢిల్లీ .. ముంబై నగరాల్లో ఒకే రోజున విడుదల చేయనున్నారు. ఆ రోజును ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
శేష్ కి 'మేజర్' తో ఉత్తరాది రాష్ర్టాల్లో మంచి గుర్తింపు దక్కింది. ఆ క్రేజ్ తోనే దేశ రాజధాని ఢిల్లీలో...వాణిజ్య రాజధాని ముంబైలో ఇలా జీ-2 కి సంబంధించి స్సెషల్ ఈవెంట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి కంటెంట్ బేస్డ్ చిత్రాలు శేష్ మరిన్ని చేసే అవకాశం ఉంది.
నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ దక్కిందంటే కారణం కేవలం తనదైన శైలి కంటెంట్ ఎంపికతోనే సాధ్యమైంది. ప్రస్తుతం యంగ్ హీరోకి బాలీవుడ్ లోనూ అవకాశాలు వస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.