`అఖండ‌` హిట్టయ్యాక కమిటవుదాం

Update: 2021-05-27 03:30 GMT
స్టార్ డైరక్టర్స్ హిట్ కొట్టాక కూడా చాలా కాలం గ్యాప్ తీసుకోవటం చాలా మందికి ఆశ్చర్యం వేస్తూంటుంది. వెంటనే సినిమా చేసేయచ్చు కదా..అంత పెద్ద హిట్ కొట్టాక గ్యాప్ ఎందుకు అని డిస్కస్ చేస్తూంటారు. అయితే అసలు నిజం చాలా మంది గుర్తించరు. స్టార్ డైరక్టర్స్ సినిమా చేయాలంటే స్టార్ హీరోలు కావాలి. రిస్క్ చేసి చిన్న హీరోలతో చేయలేరు. అయితే స్టార్ హీరోల డైరీలు ఫుల్ బిజీగా ఉండటం ఓ లెక్క అయితే , వారికి నచ్చే కథ సెట్ చేయటం మరో యజ్ఞం. ఇవన్నీ చూసినప్పుడు ఒక సినిమా చేస్తున్నప్పుడే నెక్ట్స్ ప్రాజెక్టు పనులు ప్రారంభించవచ్చు కదా అనిపిస్తుంది. అయితే అది అంత తేలిగ్గా జరిగే పనేనా. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను పరిస్దితి అలాగే ఉందని సమాచారం.

బాలయ్యతో చేస్తున్న `అఖండ‌` పూర్తికాకముందే బోయపాటి, మ‌రో సినిమా ఓకే చేసుకునే ప‌నిలో ప‌డ్డాడు. అయితే వెంటనే ఏ హీరో డేట్స్ ఇస్తారు. ఇది పెద్ద సమస్య. బోయపాటి లాంటి డైరక్టర్ కథ చెప్తానంటే పనులు అన్ని ప్రక్కన పెట్టి హీరోలు వింటారు. అయితే ఓకే చెప్పటానికి టైమ్ తీసుకుంటారు. బోయపాటి తన నెక్ట్స్ సినిమా కోసం అల్లు అర్జున్‌, రవితేజ ల ను సంప్రదిస్తున్నారట. ఆయనకు గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా చేయాల్సిన ఎగ్రిమెంట్ వుంది. ఇది వ‌ర‌కే బోయ‌పాటి అడ్వాన్స్ తీసుకున్నాడు కూడా. బ‌న్నీ కూడా.. `స‌రైనోడు` త‌ర‌వాత మ‌రోసారి బోయ‌పాటి చేయలేదు. ఈ నేప‌థ్యంలోనే బోయ‌పాటి – బ‌న్నీమ‌ధ్య స్టోరీ డిస్కషన్స్ జ‌రిగాయి. అయితే అవి ఓ కొలిక్కి రాలేదు.

దాంతో  బోయ‌పాటి ర‌వితేజ‌ని సైతం లైన్‌లో పెట్టడానికి ట్రే చేస్తున్నాడట. `భ‌ద్ర‌` త‌ర‌వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్ సెట్ట‌వ్వ‌లేదు. క్రాక్ సూపర్ హిట్ అవ్వటంతో అంతకు మించిన మాస్ సినిమా చేద్దామని ఎప్రోచ్ అయ్యారట.  అంతా బాగానే ఉంది. వాళ్లిద్దరూ స్టోరీలు విన్నారట. కానీ.. వెంటనే ఓకే చెప్పలేదట. అలాగని బోయపాటి కథ బాగోలేదని కాదుట. బోయపాటి ప్రస్తుతం ప్లాఫ్ లో ఉండి ..హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. హిట్ రాని..అన్నట్లుగా ఉన్నారని చెప్పుకుంటున్నారు.

అయితే ఆ ముక్క డైరక్ట్ గా బోయపాటితో చెప్పరు. అయితే అఖండకు మార్కెట్లో పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అది బోయపాటికు బాగా ప్లస్ అవుతోంది. ఇవన్ని ఇలా ఉంటే ఈ ఇద్దరి హీరోల డేట్లు అందుబాటులో లేవు. అయితే `అఖండ‌`బ్లాక్ బస్టర్ అయితే ..వెంటనే వాళ్లే ఫోన్ చేసి ఎప్పుడు చేద్దాం అని అడుగుతారనేది నిజం. ఇక్కడ నొచ్చుకోవటానికి,ఫీలవటానికి ఏమీ లేదు. హిట్ వస్తే ఆ లెక్క వేరు..ఫ్లాఫ్ వస్తే ఆ లెక్కలే వేరు అనేది ఇండస్ట్రీ రూల్. ఎవరూ ఏం చెయ్యలేరు. అప్పటిదాకా వెయిటింగ్ మోడ్ లో ఉండటమే.
Tags:    

Similar News