గతంలో మాదిరి సినిమా లేదు. తాను చేసే పాత్ర కోసం ఎంత కష్టానికైనా సిద్ధమవుతున్నారు నటీనటులు. స్క్రీన్ లో చూసినంతనే పాత్రలో ఇట్టే ఇమిడిపోయే షేప్ కోసం చేస్తున్న ప్రయత్నాల గురించి తెలిస్తే.. సినిమా కోసం హీరోలు ఇంతలా కష్టపడతారా? అన్న భావన కలగక మానదు. తాజాగా అఖిల్ అక్కినేని చెప్పిన మాటలు వింటే.. సినిమాకు హీరోగా పని చేయటం అంటే ఎంత కష్టమన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఆయన నటించిన ఏజెంట్ మూవీ ఈ నెల 28న విడుదల కానుంది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ గా నిలిచే పోకిరి.. బాహుబలి 2 రెండు సినిమాలు విడుదలైంది ఏప్రిల్ 28నే. అదే రోజున తన ఏజెంట్ సినిమా విడుదల కావటం అనుకోకుండా జరిగిందే తప్పించి.. కావాలని చేసింది లేదన్నారు. తనకు ఫలానా రోజున విడుదల చేయాలని అనుకోనని.. తనకు అలాంటి సెంటిమెంట్లు లేవన్న అఖిల్.. పోకిరి.. బాహుబలి 2 రిలీజ్ డేట్ నాడు తన సినిమా విడుదల కావటం అనుకోకుండా జరుగుతుందన్నారు.
ఏజెంట్ సినిమా కోసం దర్శకుడు సూరి.. తన బాడీ షేప్ మారాలన్న కండీషన్ పెట్టారన్నారు. తన బాడీ షేప్ మారితేనే సినిమా అన్న విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారని.. దీంతో షేప్ కోసం నాలుగు నెలలు సరిపోతుందని అనుకున్నా.. అలా జరగలేదన్నారు. ఏజెంట్ మూవీలో షేప్ కోసం ఏకంగా పది నెలలు కష్టపడాల్సి వచ్చిందన్నారు. ఏజెంట్ మూవీ స్క్రిప్టును తన తండ్రి నాగార్జునతో చర్చించకుండానే ఫిక్సు చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
ఈ మూవీలో తనను దారుణంగా హింసించే సీన్ ఒకటి ఉందని.. దాన్ని తాను చేయగలనా? అని అనుకున్నానని.. కానీ చివరకు చేసినట్లు చెప్పుకొచ్చారు. మమ్ముట్టి లాంటి స్టార్ హీరో ఈ సినిమాలో యాక్టు చేయటానికి ఓకే చేశారంటేనే.. ఈ మూవీ కథ ఎంత బాగా ఉంటుందో అర్థం చేసుకోచ్చన్న అఖిల్ మాటలకు తగ్గట్టు సినిమా ఎలా ఉంటుందన్నది ఈ వీకెండ్ నాటికి అర్థమైపోతుందని చెప్పాలి.