అక్కచెల్లెళ్లు గ్లామర్ ప్రపంచంలోకి ప్రవేశిస్తే ఆ ఇద్దరిపైనా మీడియా నుంచి కొన్ని కామన్ క్వశ్చన్స్ ఎదురవ్వడం సహజం. అక్క చెల్లెళ్ల మధ్య అనుబంధానికి సంబంధించిన ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటాయి. అయితే అలాంటి ఓ ప్రశ్నకు శ్రుతిహాసన్ చెల్లెలు అక్షర హాసన్ స్పందించిన తీరు తెలుగు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
వ్యక్తిగత వృత్తిగత వ్యవహారాల్ని అక్క చెల్లెళ్లు ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటారా? అన్న ప్రశ్నకు సమాధానంగా.. అక్క గురించి మరీ అంతగా పట్టించుకునేదేం ఉంటుంది! తన విషయాల్లో నేను జోక్యం చేసుకోను. నా విషయాల్లో తను అస్సలు జోక్యం చేసుకోదు. ఎవరి పనుల్లో వాళ్లు ఉంటాం! అంటూ కరాఖండిగా తెగేసి చెప్పేసింది అక్షర. అంటే అక్క చెల్లెళ్లు ఇద్దరూ ఒకరికొకరు ఇండివిడ్యువాలిటీనే ఇష్టపడతారని అక్షర ఇచ్చిన సమాధానం క్లియర్ కట్ గా తేల్చి చెప్పింది. కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలు తప్ప వ్యక్తిగత సంగతులపైనా పెద్దగా చర్చించుకోమని అక్షర హాసన్ తెలిపారు. ఇంతకు మించి అక్క గురించి చెప్పాలంటే నా వద్ద ఏదీ లేదు! ఒకరి విషయాల్లో ఒకరు వేలు పెట్టే అలవాటు లేదని తెలిపింది అక్షర. కమల్ తరహాలోనే కుమార్తెలు శ్రుతి- అక్షర వ్యక్తిగత విషయాల్లో స్వేచ్ఛను ఇష్టపడతారని ఈ సమాధానాన్ని బట్టి అర్థం చేసుకోవాలి.
అక్షరహాసన్ నటించిన `మిస్టర్ కేకే` (కడరం కొండాన్-తమిళం) తెలుగు రాష్ట్రాల్లో ఈ శుక్రవారం (జూలై 19న) రిలీజవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ మీడియాతో ముచ్చటిస్తూ అక్షర హాసన్ సినిమా పైనా స్పందించారు. అకీరా అనే ఛాలెంజింగ్ పాత్రలో నటించానని.. ఇందులో నాజర్ తనయుడు అభి కీలక పాత్ర పోషించాడని అక్షర తెలిపారు. కేవలం కథానాయికగానే కొనసాగుతారా లేక భవిష్యత్ లో ఇంకేదైనా ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు.. దర్శకురాలిగా స్థిరపడాలనే ఆలోచన తనకు ఉందని అక్షర తెలిపింది. కమల్ హాసన్ గారాలపట్టీ కథానాయికగా కెరీర్ ప్రారంభించి ఐదారేళ్లు పైగానే అవుతున్నా ఇప్పటివరకూ స్టార్ డమ్ అన్నదే చిక్కలేదు. ఆరంభం బాలవుడ్ లో ఆఫ్ బీట్ సినిమాల్లో నటించింది. అయితే కమర్షియల్ గా సక్సెస్ లేక అక్షర హాసన్ కెరీర్ వెనకబడింది. మరోవైపు శ్రుతిహాసన్ స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయాక కెరీర్ ని వ్యక్తిగత జీవితం కోసం త్యజించింది. మైఖేల్ కోర్సలేతో బ్రేకప్ తర్వాత తిరిగి కథానాయికగా బిజీ అవుతోంది. ప్రస్తుతం లాభం అనే సినిమాతో పాటు రవితేజ సరసన వేరొక ఛాన్స్ దక్కించుకుంది.