అల్లు అరవింద్ ఏం చేసినా ఓ స్ట్రాటజీ ఉంటుంది. ఆయన హడావుడిగా సినిమాలు చేసేయడు. కాంబినేషన్లు సెట్ చేయడంలో, కథలు ఎంచుకోవడంలో స్ట్రాటజిక్ గా ఉంటారాయన. అందుకే ఆయన సంస్థలో వచ్చిన సినిమాల్లో మాగ్జిమం హిట్లే. తెలుగులో సినిమాలు చేస్తూనే వేరే భాషల్లోనూ అప్పుడప్పుడూ ఓ హ్యాండ్ వేస్తుంటాడు అరవింద్. కొన్నేళ్ల కిందట బాలీవుడ్ లో చేసిన ‘గజిని’ ఆయనకు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. ఇక తమిళంలో కూడా ఈ మధ్యే ‘డార్లింగ్’ అనే సినిమా చేసి.. మాంచి హిట్టు ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఆయన కన్ను కన్నడపై పడింది.
తన నిర్మాణంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమాను కన్నడలో రీమేక్ చేయబోతున్నారట అరవింద్. ప్రముఖ కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తో కలిసి కన్నడలో ఈ సినిమాను నిర్మిస్తారట. ఐతే ఈ సినిమాకు అరవింద్ ప్ర్తత్యేకంగా పెట్టుబడి ఏమీ పెట్టట్లేదు. రీమేక్ రైట్సే ఆయన పెట్టుబడి. సినిమాను నిర్మించేది వెంకటేషే. కొంచెం పెద్ద రేంజిలోనే సినిమా చేయబోతున్నారట. నటీనటుల్ని - దర్శకుడిని ఎంపిక చేయాల్సి ఉంది. ప్రస్తుతం అరవింద్ తెలుగులో కొడుకు అల్లు అర్జున్ తో ‘సరైనోడు’ అనే భారీ సినిమాను నిర్మిస్తున్నాడు.