గీతా ఆర్ట్స్ సినిమాలు ఎప్పుడైనా హోల్ సేల్ గా బయటి వాళ్లకు అమ్మేయడం చూశారా అని అడుగుతున్నాడు అల్లు అరవింద్. కొన్ని ఏరియాలైనా అట్టి పెట్టుకుని సొంతంగా రిలీజ్ చేస్తామని.. సినిమాను విడుదల చేసే విషయంలో తాము కూడా రిస్క్ భరించాలనే.. బయ్యర్లకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తామని అల్లు అరవింద్ అన్నారు. ‘సరైనోడు’ సినిమాను కూడా అలాగే కొన్ని ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేశామని.. తమతో పాటు అందరికీ ఈ సినిమా లాభాలు తెచ్చిపెడుతోందని ఆయన అన్నారు.
మంచి మాస్ సినిమా చేయలేదన్న తనకొడుకు అసంతృప్తిని తీర్చడానికే తాను బోయపాటి శ్రీనుతో ‘సరైనోడు’ చేయించానని అరవింద్ చెప్పారు. ఒక రోజు బన్నీ నా దగ్గరికొచ్చి.. ఇప్పటిదాకా రకరకాల క్యారెక్టర్లు చేశాను. కానీ మాస్ ప్రేక్షకుల గుండెల్లోకి మాత్రం చొచ్చుకుపోలేదేమో అన్నాడు. నువ్వు అనుకున్నట్టు మాస్ ప్రేక్షకుల గుండెల్లోకి వెళ్లాలంటే బోయపాటి ఉన్నాడు. నీకోసం అతణ్ని కథ రెడీ చేయమని అడుగుతాను అని చెప్పాను. బన్నీకి ఫ్యామిలీ ఆడియోన్స్ లో మంచి ఆదరణ ఉంది. వాళ్లు మిస్ కాకుండా కథ రాయమని బోయపాటికి చెప్పాను. మేం కోరుకున్నట్లే కథ తయారు చేశాడు. ‘సరైనోడు’ సినిమాకు తొలి రోజు ఒకరకమైన టాక్ వచ్చింది. కానీ రెండో రోజు ఉదయం పది గంటలకే అన్ని థియేటర్లలోనూ హౌస్ ఫుల్స్ పడ్డాయి. సోమవారం కూడా వేగంగా థియేటర్లు నిండాయి. దీన్ని బట్టే ఈ సినిమా ఎంత పెద్ద సక్సెసో అర్థం చేసుకోవచ్చు’’ అని అరవింద్ అన్నారు.