అల్లు సెటైర్ వేసింది పవన్ కేనా?

Update: 2016-04-11 05:39 GMT
విశాఖపట్నంలో సరైనోడు ఆడియో విజయోత్సవ వేడుక గ్రాండ్ గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ కార్యక్రమం విజయవంతం కావడం.. సరైనోడు యూనిట్ ని హుషారెత్తించింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. తన బావ - గీతా ఆర్ట్స్ అధినేత - బడా నిర్మాత అయిన అల్లు అరవింద్ ను ఓ రేంజ్ లో పొగిడేశారు. నిర్మాతగా ఆయన తీసుకునే కేర్ - కమిట్మెంట్లను ప్రశంసించారు.

అంతకు ముందే అల్లు అరవింద్ స్టేజ్ పై మాట్లాడారు. సినిమా నిర్మాణంలో ఆయన తీసుకునే జాగ్రత్తల కంటే.. భయం గురించి ఎక్కువగా చెప్పారు అరవింద్. 'నేను ఏదీ వరంగా లభించిందని అనుకోను. అన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని ఒకటికి పది సార్లు చెక్ చేసుకుంటూనే ఉన్నాను. సినిమా నాకు సంతృప్తికరంగానే వస్తున్నా.. ఆడియన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో లేదో అనే భయం వెంటాడుతూ ఉంటుంది. జనాలకు మంచి సినిమా ఇవ్వాలంటే ఎవరికైనా సరే ఈ భయం ఉండాల్సిందే' అన్నారు అరవింద్.

రెండు రోజుల క్రితం విడుదలైన సర్దార్ గబ్బర్ సింగ్ మెగా ఫ్యాన్స్ ను విపరీతంగా డిజప్పాయింట్ చేసిన విషయం తెలిసిందే. ప్రేక్షకులు తిరస్కరిస్తారేమో అనే భయం ఉంటే సర్దార్ లాంటి సినిమా రాదు కదా.. అన్న సెన్స్ లోనే అల్లు ఈ డైలాగ్స్ చెప్పారనే టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News