'యాత్ర' డైరెక్టర్ కి బన్నీ ఛాన్స్ ఇస్తున్నాడా...?

Update: 2020-07-18 15:30 GMT
'పాఠశాల' అనే సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు మహి వి రాఘవ్. ఇంతకముందు 'విలేజ్ లో వినాయకుడు' 'కుదిరితే కప్పు కాఫీ' సినిమాలకు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు మహి వి రాఘవ్. ఆ తర్వాత తాప్సి ప్రధాన పాత్రలో 'ఆనందో బ్రహ్మ' అనే హారర్ కామెడీ సినిమాని డైరెక్ట్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథలోని పాదయాత్రను ఆధారంగా చేసుకుని 'యాత్ర' అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన రాఘవ్ 'యాత్ర 2' కూడా తీస్తానని ప్రకటించారు. రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్‌ మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం నేపథ్యంలో ‘యాత్ర 2’ సినిమాను తెరకెక్కిస్తానని.. వైఎస్‌ రాజా రెడ్డి - వైఎస్‌ జగన్‌ గురించి చెప్పకుండా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కథ పూర్తి కాదని రాఘవ్ వెల్లడించారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ తో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. బన్నీ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జోడీగా లక్కీ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుంది. కాగా బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బన్నీ గతేడాది 'ఓ మై ఫ్రెండ్' దర్శకుడు వేణు శ్రీరాంతో 'ఐకాన్' అనే మూవీ అనౌన్స్ చేసారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కాల్సిన 'ఐకాన్' ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. దీంతో 'పుష్ప' సినిమా తర్వాత 'ఐకాన్' సినిమా స్టార్ట్ చేస్తాడని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు మహి వి రాఘవ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. డైరెక్టర్ మహి చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్‌ పై ఫోక‌స్ పెట్ట‌మ‌ని బన్నీ చెప్పాడ‌ని న్యూస్ వచ్చింది. మరి 'యాత్ర' డైరెక్టర్ కి బన్నీ అవకాశం ఇచ్చాడో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News