బ‌న్ని ఇంట‌ర్ క్యాస్ట్ మ్యారేజ్ గుట్టు విప్పారు

Update: 2019-12-29 17:30 GMT
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంట‌ర్ క్యాస్ట్ మ్యారేజ్ అప్ప‌ట్లో హాట్ టాపిక్ అయిన సంగ‌తి తెలిసిందే. అత‌డు హైద‌రాబాద్ కి చెందిన బిజినెస్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయి స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లాడాడు. ఆ క్ర‌మంలోనే దీనిపై ర‌క‌ర‌కాల గుస‌గుస‌లు వినిపించాయి. అయితే ప్రేమ కులం చూసి పుట్ట‌దు క‌దా! అంటూ బ‌న్ని అభిమానులు త‌న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించారు. అయితే బ‌న్ని ల‌వ్ మ్యారేజ్ విష‌యంలో డాడ్ అల్లు అర‌వింద్.. మ‌ద‌ర్ నిర్మ‌ల గారు ఒప్పుకున్నారా.. అంటే.. తాజాగా లీకైన అస‌లు సంగ‌తి ఇదీ.

అస‌లు స్నేహారెడ్డిని పెళ్లాడ‌తాను అని బ‌న్ని మొద‌ట త‌న త‌ల్లి గారితోనే చెప్పార‌ట‌. ``నువ్వు చేసుకున్నా.. మేం వేరే అమ్మాయిని చూసి చేసినా నువ్వు హ్యాపీగా ఉండ‌డ‌మే ముఖ్యం. నువ్వు హ్యాపీగా ఉంటే మేం హ్యాపీ`` అని బ‌న్ని త‌ల్లిగారైన నిర్మ‌ల అన్నార‌ట‌. మ‌రి అర‌వింద్ ఏమ‌న్నారు? అంటే.. అర్జున్‌ ఇంటర్‌క్యాస్ట్‌ మ్యారేజ్‌ విషయం మా ఇంట్లో అయిదు నిమిషాల్లోనే సెటిల్ చేశాం. ముందు స్నేహ విషయం బన్ని తన అమ్మ దగ్గరే చెప్పాడు... అంటూ అస‌లు సంగ‌తిని చెప్పారు.

బ‌న్ని- స్నేహా జంట‌కు ఇద్ద‌రు కిడ్స్. మాస్టార్ అయాన్.. బేబి అర్హ వ‌డి వ‌డిగానే ఎదిగేస్తున్నారు. తీరిక స‌మ‌యాల్లో తాత‌య్య‌ను.. డాడ్ ని చిన్నారి అర్హ‌ ఆట ప‌ట్టించే ఫోటోలు ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. అలాగే టాలీవుడ్ ఆద‌ర్శ జంట‌గానూ బ‌న్ని- స్నేహా జోడీ పాపుల‌ర‌య్యారు. ప్రేమ పెళ్లిని స‌క్సెస్ చేసుకున్న బెస్ట్ హీరోగా బ‌న్నీపై అభిమానుల నుంచి ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. పెద్ద‌లు కుదిర్చిన ప్రేమ పెళ్లిలో ఉండే ఆనందాన్ని బ‌న్ని ఆస్వాధిస్తున్నార‌న‌డానికి ఇంత‌క‌న్నా ఏం కావాలి?



Tags:    

Similar News