బన్నీ అతడిని మామూలుగా పొగడలేదు

Update: 2018-07-30 04:12 GMT
ఒక స్టార్ హీరోకు తన కంటే చిన్న స్థాయి.. వర్ధమాన కథానాయకుడిని పొగడ్డానికి కొంచెం ఇగో అడ్డొస్తుంది. తమ ఫ్యామిలీ హీరోలైతే ఓకే కానీ.. బయటి వాళ్లను పొగడ్డం అరుదు. ఒకవేళ పొగిడినా.. కొంచెం పరిమితుల్లో ఉండే పొగుడుతాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం యంగ్ హీరో విజయ్ దేవరకొండను మామూలుగా కీర్తించలేదు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసి తానెంత ఫిదా అయిపోయింది వివరిస్తూ ‘గీత గోవిందం’ ఆడియో వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బన్నీ.

‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసి తాను చాలా డిస్టర్బ్ అయిపోయినట్లు బన్నీ చెప్పాడు. తాను ఒక వారం పది రోజుల పాటు షాక్ లో ఉన్నానని.. ఎవరినీ కలవడానికి కూడా ఇష్టపడలేదని.. ఎవరైనా కథ చెప్పడానికి వచ్చినా వినడానికి ఇష్టపడలేదని బన్నీ వెల్లడించాడు. విజయ్ ఆ సినిమాలో మామూలుగా పెర్ఫామ్ చేయలేదని.. ఆ ఏడాదికి ఫిలిం ఫేర్ అవార్డు కచ్చితంగా అతడికే దక్కాలని బలంగా కోరుకున్నానని బన్నీ చెప్పాడు. గత ఏడాది తెలుగులో ఇంకో ఇద్దరు ముగ్గరు హీరోలు కూడా బాగా నటించారని.. కానీ వాళ్ల కంటే కూడా విజయ్ ది గ్రేట్ పెర్ఫామెన్స్ అని బన్నీ అన్నాడు. ఎక్కడ ఫిలిం ఫేర్ అవార్డుల్లో బెస్ట్ డెబ్యూ అవార్డిచ్చి సరిపెడతారో అని కంగారు పడ్డానని.. కానీ అలా ఏమీ లేకుండా ఉత్తమ నటుడిగా విజయ్ కే అవార్డివ్వడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని బన్నీ తెలిపాడు. ‘గీత గోవిందం’లో కూడా విజయ్ అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చాడని.. హీరోయిన్ డామినేటెడ్ సినిమా అయిన ఈ చిత్రంలోనూ తన ప్రత్యేకత చాటుకుని.. బాయ్-గర్ల్ స్టోరీగా మార్చిన ఘనత విజయ్ కే చెందుతుందని బన్నీ కితాబిచ్చాడు.
Tags:    

Similar News