మిల‌ట‌రీ గ్రామానికి వెళ్తున్న బ‌న్నీ

Update: 2018-04-06 08:07 GMT
ప్ర‌స్తుతం ‘నా పేరు సూర్య‌- నా ఇల్లు ఇండియా’ చిత్రంలో న‌టిస్తున్న స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌... త్వ‌ర‌లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని మిల‌ట‌రీ మాధ‌వ‌రం గ్రామానికి వెళ్ల‌డానికి రెఢీ అవుతున్నాడు. ‘నా పేరు సూర్య‌’ సినిమాలో బ‌న్నీ యంగ్ ఆర్మీ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు. అందుకే  భార‌త మిల‌ట‌రీ సైన్యానికి ఎన‌లేని సేవ‌లు అందించిన మాధ‌వరం గ్రామానికి వెళ్లి... వీర జ‌వాన్ల‌కు నివాళులు అర్పించ‌నున్నారు.

ప‌.గో జిల్లాలోని మిల‌ట‌రీ మాధ‌వ‌రం అంటే అంద‌రికీ గుర్తొచ్చేది భార‌త ఆర్మీయే. ఇక్క‌డ ప్ర‌తీ ఇంటి నుంచి క‌నీసం ఒక్క‌రు ఆర్మీలో చేరారు. భార‌త స‌రిహ‌ద్దులో సైనికులుగా సేవ‌లు అందించారు. అందుకే మిల‌ట‌రీ ఆఫీస‌ర్ క‌థ‌తో రూపొందుతున్న సినిమాలో న‌టించిన అల్లుఅర్జున్‌... సైనికుల‌ను... వారి కుటుంబాల‌ను క‌లుసుకునేందుకు ఆ ఊరికి వెళుతున్నారు. ఏప్రిల్ 22న మాధ‌వ‌రం ఊరికి వెళ్లి... గ్రామ‌స్థుల‌తో స‌మ‌యం గ‌డ‌ప‌నున్నాడు బ‌న్నీ. ఆయ‌న‌తో పాటు ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశీ కూడా వెళ్లే అవ‌కాశం ఉంది. ఆ త‌ర్వాతి వారం ఏప్రిల్ 29న గ్రాండ్ లెవెల్లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ నిర్వ‌హించ‌నున్నారు. హైద‌రాబాద్ లోని గ‌చ్చిబౌలి స్టేడియంలో ఈ వేడుక జ‌ర‌గ‌నుంది.

ఏప్రిల్ మూడో వారంలోగా షూటింగ్ మొత్తం ముగించి... పోస్ట్ ప‌నుల‌ను కూడా వీలైనంత త్వ‌రగా పూర్తిచేయాల‌ని అనుకుంటున్నారు. ఈ సినిమాలో యాంగ్రీ యంగ్ ఆర్మీ ఆఫీస‌ర్‌ గా న‌టిస్తున్న బ‌న్నీ లుక్ యువ‌త‌కు బాగా న‌చ్చేసింది. చాలామంది స్టైలిష్ స్టార్ లుక్‌ను ఫాలో అవుతున్నారు కూడా. సినిమా విడుద‌ల‌య్యాక ఈ ఫాలోవ‌ర్స్ సంఖ్య మ‌రింత పెరుగుతుందేమో చూడాలి.
Tags:    

Similar News