స్నేహాలో ఆ రెండు క్వాలిటీస్‌ బన్నీ ని ప్రేమలో పడేశాయట

Update: 2021-04-15 15:30 GMT
టాలీవుడ్‌ లో మోస్ట్‌ ఇంట్రెస్టింగ్‌ అండ్‌ ఎట్రాక్షన్‌ బ్యూటీఫుల్‌ కపుల్‌ ల జాబితా తీస్తే ఖచ్చితంగా ముందు వరుసలో అల్లు అర్జున్‌ మరియు స్నేహా రెడ్డిల జోడీ ఉంటుంది అనడంలో సందేహం లేదు. వీరిద్దరిది ప్రేమ వివాహం. ప్రేమించుకున్న వీరిద్దరు పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెల్సిందే. వీరి ప్రేమకు ఎక్కడ బీజం పడింది.. అసలు ఇద్దరు ఎలా పరిచయం అనే విషయాలు చాలా మందికి ఆసక్తికరమైన విషయాలు. ఈ విషయాల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్‌ రివీల్‌ చేయడం జరిగింది.

స్నేహా రెడ్డిని మొదటి సారి అల్లు అర్జున్‌ ఒక నైట్‌ క్లబ్‌ లో చూడటం జరిగిందట. ఆ సమయంలో అందరు కూడా చాలా మోడ్రన్‌ డ్రస్ ల్లో కనిపిస్తే స్నేహా రెడ్డి మాత్రం చాలా డీసెంట్‌ అయిన డ్రస్ లో పార్టీకి వచ్చిందట. అలాగే ఆ సమయంలో ఆమె యాటిట్యూడ్‌ కూడా చాలా బ్యాలెన్సింగ్‌ గా ఉండటంతో పాటు అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఆమె చిరు నవ్వు ఉందని బన్నీ భావించాడట. ఆమె హుందాతనం మరియు బ్యాలెన్సింగ్‌ గుణం కారణంగా వెంటనే ఆమెతో ప్రేమలో పడ్డట్లుగా బన్నీ చెప్పుకొచ్చాడు.

అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టులో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల అది వచ్చే ఏడాది ఏప్రిల్‌ కు వాయిదా వేయడం జరిగింది. కొరటాల శివ కంటే ముందు పుష్ప తర్వాత మరేదైనా సినిమాను బన్నీ చేసే అవకాశాలు ఉన్నాయి. వకీల్‌ సాబ్‌ దర్శకుడు వేణు శ్రీరామ్‌ తో ఐకాన్‌ సినిమాను బన్నీ మొదలు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.
Tags:    

Similar News