'బెజవాడ' సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన అమలాపాల్.. 'నాయక్' 'ఇద్దరమ్మాయిలతో' 'జైండాపై కపిరాజు' వంటి చిత్రాల్లో నటించింది. రామ్ చరణ్ - అల్లు అర్జున్ - నాగచైతన్య - నాని వంటి ప్రముఖ హీరోలతో నటించినా.. అమల స్టార్ హీరోయిన్ గా మారలేకపోయింది. తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశాలు అందుకోలేకపోయింది. దీంతో తమిళ మళయాల ఇండస్ట్రీలపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. అయితే అమలా పాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత ఉండదని.. నెపోటిజం ఇండస్ట్రీని ఏలుతుందనే విధంగా మాట్లాడిన అమలా పాల్.. ఇక్కడ సినిమాలు తక్కవగా చేయడానికి అదే కారణమని చెప్పింది. అంతేకాదు తన సినీ కెరీర్ ను తమిళ సినిమాతో ప్రారంభించడం అదృష్టంగా పేర్కొంది. తమిళ్ లో తాను నటించిన మొదటి రెండు సినిమాలు కూడా విడుదల కాలేదని.. మూడో సినిమా విడుదలై తనని ఓవర్ నైట్ స్టార్ ని చేసిందని అమల చెప్పింది.
''తెలుగులో నేను ఎంట్రీ ఇచ్చినప్పుడు కొన్ని కుటుంబాల చేతుల్లోనే పరిశ్రమ ఉందని నాకు అర్థమైంది. ఆ ఫ్యామిలీస్ మాత్రమే ఇండస్ట్రీలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఆ సమయంలో వారు తీసే సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉండేవి. ప్రతి చిత్రంలోను ఇద్దరు హీరోయిన్స్ ఉండేవారు.. హీరోయిన్స్ ను గ్లామరస్గా చూపించేవారు. కొన్ని లవ్ సీన్స్ - సాంగ్స్ లో మాత్రమే హీరోయిన్ కనిపించేవారు. చాలా కమర్షియల్ గా సినిమాలు తీసేవారు. అందువల్ల నేను తెలుగు ఇండస్ట్రీకి చేరువ కాలేకపోయాను. చాలా తక్కువ చిత్రాలు చేశాను'' అని అమలా పాల్ తెలిపింది.
''అదృష్టవశాత్తూ పిల్మ్ మేకర్స్ కొత్త వారి కోసం వెతుకుతున్నప్పుడు నేను తమిళ సినిమా పరిశ్రమకు వచ్చాను. ఓ ఏడాది పాటు ఆడిషన్స్ - మీటింగ్స్ అంటూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను. నా కెరీర్ ప్రారంభంలో చేసిన రెండు సినిమాలు ఇప్పటికి కూడా విడుదలకు నోచుకోలేదు. మూడో చిత్రం 'మైనా' విడుదలై సంచలన విజయం సాధించింది. దీంతో నేను ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిపోయాను. 'మైనా' లో మంచి నటన కనబరిచిన తర్వాత నాకు ఆఫర్స్ రావడం ప్రారంభించాయి. నటిగా అంగీకరించబడ్డాను కాబట్టి అందరు లిస్ట్ స్టార్స్ తో కలిసి పని చేసాను'' అని అమలా పేర్కొంది.
ఇకపోతే అమలా పాల్ తెలుగులో నేరుగా నటించిన సినిమాల కంటే డబ్బింగ్ చిత్రాలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. 'లవ్ ఫెయిల్యూర్' 'మేము' 'వి.ఐ.పి 2' 'ఆమె' వంటి సినిమాలతో పలకరించింది. ఆ మధ్య 'పిట్టకథలు' వంటి నెట్ ఫ్లిక్స్ సిరీస్ లో నటించిన అమల.. చివరగా తెలుగులో ఆహా ఓటీటీలో 'కుడి ఎడమైతే' అనే సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ తో మెప్పించింది.
అమలా పాల్ నటించిన 'కడవర్' చిత్రం డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అలానే 'విక్టిమ్' అనే వెబ్ సిరీస్ సోనీ లైవ్ లో ప్రసారమవుతోంది. తమిళ్ లో ఆమె నటించిన 'అధో అంధ పరవై పోలా' సినిమా డిలే అవ్వగా.. 'క్రిస్టోఫర్' 'టీచర్' 'ఆడు జీవితం' వంటి మలయాళ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.